PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎన్నో విడత అంటే..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల పథకాలను రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు వ్యవసాయంలో ఆసరా ఉండేందుకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎన్నో విడత అంటే..
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2023 | 3:11 PM

పీఎం కిసాన్ పథకం 14వ విడత విడుదలకు ఒక్కరోజు మిగిలి ఉంది . రిపోర్ట్స్ ప్రకారం.. 14 వ విడత జూలై 27 న విడుదల అవుతుంది. పిఎం కిసాన్ యోజన 8 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు గురువారం నాడు 2,000 రూపాయలు నేరుగా బదిలీ చేయనున్నారు ప్రధాని మోడీ. 2019లో ప్రారంభించబడిన పీఎం కిసాన్ యోజన పేద, మధ్యతరగతి రైతులకు వ్యవసాయానికి సబ్సిడీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు అందజేస్తుంది. ఒకేసారి రూ.6వేలు చెల్లించే బదులు ఒక్కోదానికి రూ.2వేలు చొప్పున 3 వాయిదాల్లో నగదు బదిలీ అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రాథమికంగా పేద రైతులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ స్కీమ్‌లో పన్ను చెల్లింపుదారులు, వృత్తిదారులు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, పెన్షనర్లు మినహా వ్యవసాయంలో నిమగ్నమైన రైతులందరినీ ఇందులో చేర్చారు. ఇటీవల, పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల్లో ఎవరైనా తమకు పథకం వద్దు అని భావిస్తే, వారు స్వచ్ఛందంగా నిలిపివేయవచ్చు.

పీఎం కిసాన్ లాభాన్ని ఎలా వదులుకోవాలి?

  • PM కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి: pmkisan.gov.in
  • ఫార్మర్స్ కార్నర్ కింద ఉన్న ‘వాలంటరీ సరెండర్ ఆఫ్ పీఎం కిసాన్ బెనిఫిట్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి ఓటీపీ పొందండి.
  • మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత, మీరు ఇప్పటివరకు అందుకున్న మొత్తం వాయిదాల వివరాలు కనిపిస్తాయి
  • మీరు పీఎం కిసాన్ ప్రయోజనాన్ని వదులుకోవాలనుకుంటున్నారా అని ఇది అడుగుతుంది. అవునుపై క్లిక్ చేసి, ఓటీపీని నమోదు చేయండి
  • దీని తర్వాత మీరు తదుపరి వాయిదాలను పొందలేరు.

ఇంతకు ముందు అందుకున్న పీఎం కిసాన్ డబ్బును తిరిగి ఇవ్వాలా?

మీరు పీఎం కిసాన్ యోజన ప్రయోజనాన్ని సరెండర్ చేసినప్పుడు మీరు గత బకాయి మొత్తం వివరాలను చూస్తారు. అంత డబ్బు వదులుకోవాలని కాదు. మీరు ఇంతకు ముందు అందుకున్న డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. తదుపరి వాయిదాలు మాత్రమే రావడం ఆగిపోతుంది.అంతేకాదు ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రం కూడా వస్తుంది. గతంలో గ్యాస్ సబ్సిడీ విషయంలోనూ ప్రభుత్వం గివ్ అప్ క్యాంపెయిన్ చేసింది. అప్పుడు కూడా లక్షలాది మంది సబ్సిడీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్ పథకంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వదులుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!