IRCTC నుంచి రైలు టికెట్ బుకింగ్ కావడం లేదా.. అయితే ఈ యాప్‌ నుంచి టికెట్లను పొందండి.. అవేంటంటే..

Train Ticket Booking: మంగళవారం ఉదయం ఐఆర్సీటీసీ టిక్కెట్ బుకింగ్ సేవ పనిచేయలేదు. దీంతో చాలా మంది వినియోగదారుల చెల్లింపులు కూడా కోత పడి వారికి టిక్కెట్లు బుక్కింక్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఈ సందర్భంలో, మీరు ఇతర యాప్‌లను ప్రయత్నించవచ్చు. ఈ యాప్‌లు మీకు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. ఐఆర్సీటీసీ పని చేయకపోతే మీరు చాలా యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా టికెట్ పొందవచ్చు.

IRCTC నుంచి రైలు టికెట్ బుకింగ్ కావడం లేదా.. అయితే ఈ యాప్‌ నుంచి టికెట్లను పొందండి.. అవేంటంటే..
IRCTC
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 25, 2023 | 9:18 PM

ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) వెబ్‌సైట్ మంగళవారం ఉదయం నిలిచిపోయింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోయారు. టికెట్ బుకింగ్ సమయంలో చెల్లింపులు చేసిన తర్వాత కూడా తమ టిక్కెట్లు బుక్ కావడం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు మొదలు పెట్టారు. ఐఆర్‌సీటీసీ దీనిని సాంకేతిక సమస్యగా పేర్కొంది. ఐఆర్‌సీటీసీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సమస్య గురించి సమాచారాన్ని అందించింది. ఐఆర్‌సీటీసీ రాసింది.. ‘టెక్నికల్ కారణాల వల్ల టిక్కెట్ బుకింగ్ సేవ అందుబాటులో లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి మా సాంకేతిక బృందం పని చేస్తోంది. ఈ సమస్య పరిష్కరించబడిన వెంటనే, మేము దాని గురించి మీకు తెలియజేస్తాము. అంటూ ట్వీట్ చేసింది ఐఆర్‌సీటీసీ.

అయితే, ఈ సమయంలో మీరు మీ కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే.. మీరు ఇతర యాప్‌లను ఉపయోగించవచ్చు. ఐఆర్‌సీటీసీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సాంకేతిక కారణాల వల్ల, మీకు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లో టిక్కెట్ బుకింగ్ సేవ లభించదని ప్లాట్‌ఫారమ్ తెలిపింది.

ఈ సందర్భంలో, మీరు రెండవ ఎంపికను ఉపయోగించవచ్చు. మీరు అమెజాన్, మేక్ మై ట్రిప్ వంటి బీ2సీ ప్లేయర్‌ల నుంచి మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. మీరు రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోగలిగే కొన్ని యాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు అని పేర్కొంది ఐఆర్‌సీటీసీ.

ఇలా ట్రిప్ చేయండి

ఈ వెబ్‌సైట్ టిక్కెట్ బుకింగ్‌తో పాటు ట్రిప్ ప్లానింగ్‌కు బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ నుంచి మీరు టిక్కెట్లు మాత్రమే కాకుండా.. హోటల్‌లు, క్యాబ్‌లు, రైళ్లు, బస్సులు, విమానాలను కూడా బుక్ చేసుకోవచ్చు. మీ ప్రయాణానికి సంబంధించిన దాదాపు అన్ని సౌకర్యాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఐఆర్‌సీటీసీ టిక్కెట్ బుకింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇక్సిగో

రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇక్సిగో ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి రైలుకు సంబంధించిన మొత్తం సమాచారంతో పాటు టికెట్ బుకింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. మీరు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఛార్జ్ ఎంపికను కూడా పొందవచ్చు.

ట్రైన్‌మ్యాన్

ఈ యాప్ ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయింది. ఇక్కడ నుంచి మీరు రైలులో సీట్ లభ్యత,  టిక్కెట్ బుకింగ్ రెండింటినీ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు.. పీఎన్ఆర్  స్థితి, కోచ్ స్థానాన్ని తనిఖీ చేయడం వంటి వివరాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

పేటీఎం 

పేటీఎంని ఆన్‌లైన్ చెల్లింపు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగిస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి రైల్వే టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు యాప్‌లోనే రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రత్యేక ఎంపికను అందిస్తోంది. పేటీఎం మాత్రమే కాదు.. మీరు అమెజాన్ పే, ఫోన్ పేతోపాటు ఇతర ఆన్‌లైన్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లలో కూడా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే సదుపాయాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!