Investment Tips: వాటిల్లో పెట్టుబడితో ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ.. రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఇదే
ట్రెజరీ బిల్లులు (టీ-బిల్లులు). ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేది బ్యాంకులు అందించే ఆర్థిక పథకం. దీనిలో మీరు కొంత సమయం వరకు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. అలాగే అది మెచ్యూర్ అయ్యే వరకు వడ్డీని పొందవచ్చు. మరోవైపు ట్రెజరీ బిల్లులు భారత ప్రభుత్వం జారీ చేస్తుంది.

పొదుపు నుంచి స్థిరమైన ఆదాయంతో సురక్షితమైన పెట్టుబడి కోసం చూసే చాలా మంది మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకంలో పెట్టుబడి పెడతారు. కొన్ని నివేదికల ప్రకారం ప్రజలు ప్రతి సంవత్సరం సుమారు రూ. 60 ట్రిలియన్లు సొమ్మును పొదుపు చేస్తారు. అందులో 15 శాతం ఎఫ్‌డీల్లో మిగిలినదంతా బంగారంపై పెడతారు. అయితే ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకనే వారు ఆర్థిక భద్రతను అందించే ప్రత్యామ్నాయ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. ఆ పథకం ట్రెజరీ బిల్లులు (టీ-బిల్లులు). ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేది బ్యాంకులు అందించే ఆర్థిక పథకం. దీనిలో మీరు కొంత సమయం వరకు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. అలాగే అది మెచ్యూర్ అయ్యే వరకు వడ్డీని పొందవచ్చు. మరోవైపు ట్రెజరీ బిల్లులు భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇది భవిష్యత్తులో తిరిగి చెల్లించడానికి ప్రామిసరీ నోట్‌గా జారీ చేసిన ద్రవ్య మార్కెట్ పరికరమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ టీ బిల్లుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
టీ బిల్లులను జీరో-కూపన్ సెక్యూరిటీలు అని కూడా పిలుస్తారు. ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా వీటిని జారీ చేస్తారు. ఇవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల మెచ్యూరిటీ పీరియడ్‌తో వస్తాయి. 3 నెలల, 12 నెలలకు టీ-బిల్లులు 4.5 నుంచి 6.7 శాతం వరకూ వడ్డీ రేట్లను అందిస్తాయి. టీ-బిల్లులు రిస్క్ లేనివి, సురక్షితమైనవి. ఎందుకంటే వీటిని ప్రభుత్వం జారీ చేస్తుంది. పైగా ఇవి మెచ్యూర్ అయిన తర్వాత, ఈ బిల్లులు మీ డీమ్యాట్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతాయి. డీమ్యాట్ ఖాతా నుంచిడి ముఖ విలువ మీ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.
టీ-బిల్లుల నుంచి పొందిన లాభం స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. అలాగే పెట్టుబడిదారుడి స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను వర్తిస్తుంది. ఎఫ్‌డీలు తరచుగా కనీస పెట్టుబడి పరిమితులను కలిగి ఉంటాయి. ఎఫ్‌డీలు కేవలం రూ. 1,000తో తెరుస్తారు. కానీ టీ-బిల్లులలో పెట్టుబడి పెట్టడానికి కనీసం రూ. 25,000 అవసరం. అలాగే అవి రూ. 25,000 గుణిజాలలో మాత్రమే జారీ చేస్తారు. టీ-బిల్లులు స్థిరమైన వడ్డీ రేటును కలిగి ఉన్నప్పటికీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మార్కెట్ స్థితి, డిపాజిట్ జారీ చేసే ఆర్థిక సంస్థపై ఆధారపడి మారవచ్చు. ట్రెజరీ బిల్లులను సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. అలాగే మెచ్యూరిటీకి ముందు సెకండరీ మార్కెట్‌లో విక్రయించవచ్చు. అయితే ఎఫ్‌డీలకు మాత్రం నిర్ణీత వ్యవధి ఉంటుంది. అలాగే మెచ్యూరిటీకి ముందు డబ్బును విత్‌డ్రా చేస్తే జరిమానా చెల్లించాలి. మొదట్లో కేవలం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మాత్రమే టీ బిల్స్‌లో పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు అది రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి