PM Kisan: మరికొన్ని గంటల్లో 21000 కోట్ల బదిలీ.. మీ స్టేటస్‌ ఏంటో తెలుసుకోండి..!

PM Kisan: పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు మే 31(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 10 కోట్ల 50 లక్షల మంది రైతుల

PM Kisan: మరికొన్ని గంటల్లో 21000 కోట్ల బదిలీ.. మీ స్టేటస్‌ ఏంటో తెలుసుకోండి..!
Pm Kisan
Follow us
uppula Raju

|

Updated on: May 30, 2022 | 8:55 PM

PM Kisan: పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు మే 31(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 10 కోట్ల 50 లక్షల మంది రైతుల ఖాతాలలో ఏకకాలంలో రూ.21000 కోట్లు బదిలీ అవుతాయి. మీ ఖాతాలో డబ్బు వచ్చిందో లేదో మీరు సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అయితే ఈ కేవైసీ చేయకపోతే డబ్బు ఆగిపోవచ్చు అలాగే ఆధార్ సీడింగ్ లేకపోయినా డబ్బు ఆగిపోతుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా బ్యాంక్ ఖాతా నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 6000 మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ పథకం ద్వారా 11,11,87,269 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో2000 రూపాయలను జమ చేసింది. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. ఈ పథకం కింద సాగు భూమి ఉన్న రైతులు మాత్రమే లబ్ధి పొందగలరు. ఆదాయపు పన్ను చెల్లించే రైతులు ఎవరైనా లబ్ధి పొందినట్లయితే అతను డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

FTO కనిపిస్తుందా..!

ఇవి కూడా చదవండి

మీరు పీఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకున్నట్లయితే మంగళవారం మే 31 మధ్యాహ్నం తర్వాత పథకం వెబ్‌సైట్‌లో దాని లబ్ధిదారుల జాబితా ఉంటుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోండి. డబ్బు మీ ఖాతాకు బదిలీ అయిందా లేదా తనిఖీ చేసినప్పుడు FTO అని రాసి ఉంటే ఏ సందర్భంలోనైనా మీ ఖాతాలో 2000 రూపాయలు వస్తాయని అర్థం చేసుకోండి.

ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

ఈ పథకం కింద అర్హులయ్యే రైతులు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఒకే ఒక్క షరతు ఏంటంటే ఆదాయ పన్ను చెల్లించేవారు అయి ఉండకూడదు. కానీ దరఖాస్తు చేసేటప్పుడు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, భూమి రికార్డును సరిగ్గా నింపాలని గుర్తుంచుకోండి. అందులో పొరపాటు జరిగితే డబ్బులు రావు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.