Electric Car: ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోండి..!
Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు చాలామందిలో అనేక సందేహాలు మెదులుతాయి. ఈ పరిస్థితిలో వాటికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. ఇక్కడ ఎలక్ట్రిక్ కారు రేంజ్, బ్యాటరీ, భద్రతకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రశ్న: పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితం..?
సమాధానం: ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి ప్రవేశించే ముందు అనేక దశల పరీక్షలని దాటవలసి ఉంటుంది. అందువల్ల పెట్రోల్, డీజిల్‌తో నడిచే కారు మాదరి ఎలక్ట్రిక్ కారు కూడా నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రిక్ కారులో ఇంధన ట్యాంక్ ఉండదు కాబట్టి ఇది ఇతర కార్ల కంటే సురక్షితమైనదిగా చెప్పవచ్చు.
ప్రశ్న: ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌తో ఎంతదూరం నడుస్తుంది?
సమాధానం: మీరు ఒకే ఛార్జ్‌పై పొందే పరిధి ప్రతి ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్‌పై ఆధారపడి ఉంటుంది. దాదాపు ఒక ఎలక్ట్రిక్ మధ్య-శ్రేణి కారు ఒకే ఛార్జ్‌తో 180 కి.మీ నుంచి 450 కి.మీల పరిధిని ప్రయాణించగలదు.
ప్రశ్న: ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది?
సమాధానం: ఏదైనా ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ అత్యంత ముఖ్యమైన భాగం. కారు బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. బ్యాటరీ జీవితం గురించి మాట్లాడుతూ సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లలో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 సంవత్సరాల పాటు మంచి పనితీరును కలిగి ఉంటుంది. అయితే ఇది వినియోగదారులు కారు, బ్యాటరీని ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న: ఎలక్ట్రిక్ కార్లు నిజంగా పర్యావరణ అనుకూలమైనవేనా?
జవాబు: ఎలక్ట్రిక్ కారును పెట్రోల్, డీజిల్‌తో నడిచే కారుతో పోల్చినట్లయితే పర్యావరణ అనుకూలమైనదని స్పష్టమవుతుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు చాలా కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లు ఇంధనం లేకుండా నడుస్తాయి. చాలా తక్కువ కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి.
ప్రశ్న: ఎలక్ట్రిక్ కారు ఎందుకు చాలా ఖరీదు..?
సమాధానం: ఎలక్ట్రిక్ కారు ఖరీదైనదిగా ఉండటానికి ప్రధాన కారణం దాని బ్యాటరీ. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలు చాలా ఖరీదైనవి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పెద్దగా పోటీ లేదు. అయితే పెరుగుతున్న పోటీ వల్ల ఎలక్ట్రిక్ కార్ల సాంకేతికత కూడా చౌకగా మారే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి