Foreign Trips: ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ జేబులు ఖాళీ కావడం గ్యారెంటీ

ప్రపంచంలో లండన్, పారిస్, రోమ్.. ఆమ్‌స్టర్‌డామ్ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రజలు ఈ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రతిరోజూ గంటల తరబడి..

Foreign Trips: ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ జేబులు ఖాళీ కావడం గ్యారెంటీ
Foreign Trips
Follow us
Subhash Goud

|

Updated on: Feb 25, 2023 | 8:32 PM

ప్రపంచంలో లండన్, పారిస్, రోమ్.. ఆమ్‌స్టర్‌డామ్ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రజలు ఈ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రతిరోజూ గంటల తరబడి మీటింగ్‌లు, ఆఫీసు పనులతో విసిగిపోతున్న ఎంతో మంది ట్రిప్‌కి వెళ్లాలని ఆలోచిస్తుంటారు. జులైలో తన ఫ్యామిలీతో హాలిడేకి యూరప్ వెళ్లాలనేది ప్లాన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు యూరప్ సందర్శించడానికి ఉత్తమ సమయం. చాలా మంది టూర్‌కు వెళ్లేవారు యూరప్ ట్రిప్ గురించి ఆరా తీస్తుంటారు. అయితే ఈసారి ఇలా ట్రిప్ కు వెళ్ళడం చలా ఖరీదైనదిగా ఉంటుందని, ఈ ప్రశ్నను ప్రభుత్వం అలాగే ఆర్థిక మంత్రిని అడగండి అంటూ తెలియడంతో ట్రిప్‌కు వెళ్లేవారు ఆశ్చర్యపోతున్నారు.

మీరు మీ రోజువారీ దినచర్యతో విసుగు చెంది, ఫామిలీ ట్రిప్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రశ్నకు జవాబు అవునంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది జేబుకు భారంగా ఉంటుంది. అందుకే విదేశాలకు వెళ్లడం ఇప్పుడు మరింత ఖరీదు అవుతుంది. దీనికి కారణం బడ్జెట్ 2023లో చేసిన ప్రకటన. ఇదొక్కటే కాదు. విదేశాల్లో పెట్టుబడులు పెడితే ఇంకా ఎక్కువ గా జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ముందుగా విదేశాలకు వెళ్లడం ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం.

విదేశీ టూర్ ప్యాకేజీలపై అధిక పన్ను విధించేందుకు ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206Cని సవరించింది. దీని కింద టీసీఎస్‌ 20% చొప్పున విధించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు విదేశీ పర్యటన ప్యాకేజీలను బుక్ చేస్తే, మీరు టీసీఎస్‌గా 5% పన్ను చెల్లించాలి. కానీ జూలై 1 నుంచి ఇది 20 శాతానికి పెరగనుంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు.. ఇప్పుడు కనుక మీరు ఫారిన్ టూర్ ప్యాకేజీని కొనుగోలు చేయడానికి 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే మీరు 5% చొప్పున 20,000 రూపాయల టీసీఎస్‌ చెల్లించాలి. అయితే జూలై 1, 2023 నుంచి మీరు దీని కోసం 80,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ప్యాకేజీని కొనుగోలు చేసేటప్పుడు 60,000 రూపాయలు ఎక్కువ చెల్లించాలన్న మాట.

ఖర్చుల సంగతి అటుంచితే… ఇప్పుడు పెట్టుబడి విషయానికి వద్దాం… విదేశాల్లో ఆస్తి, షేర్లు కొనుగోలు చేసినా, బంధువుకు డబ్బు పంపినా.. ఇకపై ఎక్కువ పన్ను చెల్లించాల్సిందే. దీనిని కూడా ప్రభుత్వం సాధారణ బడ్జెట్ 2023లో ప్రతిపాదించింది. 24, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దేశం వెలుపల డబ్బు పంపితే ఎక్కువ పన్ను విధిస్తారు. ఇప్పుడు విదేశాలలో పెట్టుబడి పెట్టడానికి ఎంత ఖర్చవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం.

బడ్జెట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ కింద దేశం వెలుపల డబ్బు పంపడంపై టిసిఎస్‌ను 5% నుంచి 20% కి పెంచాలని.. రూ. 7 లక్షల పరిమితిని తొలగించాలని కూడా ప్రతిపాదించారు. అంటే జులై 1 నుంచి దేశం నుంచి బయటకు పంపే ప్రతి పైసాపై 20% పన్ను మినహిస్తారన్న మాట… అయితే, చికిత్స, విద్య కోసం విదేశాలకు పంపే డబ్బును ఈ పరిధి నుంచి తప్పించారు.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఒక ఆస్తిని లేదా షేర్‌ని కొనుగోలు చేయడానికి లేదా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద అతని బంధువుకు $ 2 లక్షలను విదేశాలకు పంపితే ఆ మొత్తంలో 20 శాతం అంటే రూ.40,000 బ్యాంకు ద్వారా నిలిపివేస్తారు. అది మీ పేరు మీద ప్రభుత్వ ఖాతాలో జమ ఆవుతుంది. మిగిలిన 1 లక్షా 60 వేల డాలర్లు విదేశాలకు వెళతాయి. సరళీకృత రెమిటెన్స్ స్కీమ్, ఏ భారతీయుడైనా ప్రతి సంవత్సరం విదేశాలకు 2.5 లక్షల డాలర్ల వరకు పంపవచ్చు. ఇంతకంటే ఎక్కువ పంపాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆమోదం అవసరం.

విద్య, చికిత్స కోసం 5% పన్ను ఉంటుంది. చికిత్స, విద్య కోసం విదేశాలకు పంపిన ఏడు లక్షల రూపాయల పైన ఉన్న మొత్తంపై 5% చొప్పున పన్నును కొనసాగించాలని ప్రతిపాదించారు. అదేవిధంగా, విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సంస్థ నుంచి విద్యా రుణం తీసుకొని పంపిన డబ్బు మొత్తం 7 కంటే ఎక్కువ లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు దానిపై 0.5 శాతం టీసీఎస్‌ విధిస్తారు.

మీరు కూడా జూలై 1 నుంచి మీరు ప్రయాణంలో లేదా మరొక దేశంలో పెట్టుబడి పెట్టడంలో ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అయితే, ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు, మీరు వివరాలను అందించడం ద్వారా వాపసు పొందవచ్చు. ఈ నిర్ణయం రెండవ అతిపెద్ద ప్రభావం దేశీయ టూర్ ఆపరేటర్ల వ్యాపారంపై ఉంటుంది. మీరు మీ పిల్లల చదువు కోసం డబ్బు పంపుతున్నట్లయితే, అప్పుడు ఎడ్యుకేషన్ లింక్ తప్పనిసరి, తద్వారా 5% టీసీఎస్‌ మాత్రమే తీసివేస్తారు. లేకపోతే టీసీఎస్‌ 20% చొప్పున కట్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి