Paytm Cancel Protect: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.. పేటీఎం కొత్త ఆఫర్‌

చాలా సార్లు మనం విమానం, బస్సు , రైలు మొదలైన వాటిలో ముందుగానే సీట్లు బుక్ చేసుకుంటాము. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల బుకింగ్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది..

Paytm Cancel Protect: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.. పేటీఎం కొత్త ఆఫర్‌
Paytm
Follow us

|

Updated on: Feb 25, 2023 | 5:00 PM

చాలా సార్లు మనం విమానం, బస్సు , రైలు మొదలైన వాటిలో ముందుగానే సీట్లు బుక్ చేసుకుంటాము. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల బుకింగ్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ టికెట్లను రద్దు చేసుకున్నట్లయితే అందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే రద్దు చేసుకున్నందుకు ఛార్జీలు చెల్లించాలి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఇలా తరచుగా బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేయడం వల్ల చాలా నష్టం. మనం ప్రయాణించే రోజుకి దగ్గరగా ఉంటే రద్దు రుసుము ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మోసాలను నివారించేందుకు Paytm Cancel Protect ఒక కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది

ఈ స్కీమ్‌ ప్రకారం.. మీరు పేటీఎం ద్వారా విమానం, బస్సు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు… రద్దు చేయవచ్చు. ఇందు కోసం ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ మీ డబ్బు పూర్తిగా వాపసు చేస్తారు. ఎలాంటి రద్దు రుసుము ఉండదు. అయితే విమానం టికెట్‌ను రద్దు చేసుకోవాలంటే మీరు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు బుకింగ్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అదే బస్సు అయితే బయలుదేరే సమయానికి కనీసం 4 గంటల ముందు రద్దు చేయాలి. టికెట్ ధర ఎంత ఉంటే అంత మొత్తం తిరిగి వస్తుంది .

ఈ విధంగా, పేటీఎం కేవలం క్యాన్సిలేషన్ ప్రొటెక్షన్ ఆఫర్ ఇవ్వడం లేదు . అందుకు ధర కూడా నిర్ణయించారు. ఒక విధంగా ఇది ప్రమాద బీమా పథకం లాంటిదే. ఫ్లైట్ టికెట్ బుకింగ్ రద్దు నుండి రక్షణ పొందాలనుకునే వారు కనీస ప్రీమియం రూ.149 చెల్లించాలి . బస్ టిక్కెట్లు 25 రూపాయల నుండి ప్రారంభమవుతాయి .

ఇవి కూడా చదవండి

ఈ మేరకు పేటీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. మేము మా అప్లికేషన్‌లో అనేక కస్టమర్ ఫ్రెండ్లీ ఫీచర్‌లను ప్రవేశపెట్టామని పేటీఎం కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలియజేశారు. ప్రయాణానికి బుకింగ్ చేసే పనిని మేము సులభతరం చేసాబమని, భారతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చాము. క్యాన్సిల్ ప్రొటెక్ట్ అటువంటి ఫీచర్లలోఒకటి. టికెట్ బుకింగ్‌ను సులభతరం చేయడమే కాకుండా ప్రయాణ బుకింగ్‌లపై వివిధ ఆఫర్‌లు, తగ్గింపులను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి