ఈ నెలలో లాంచ్‌కానున్న 4 స్మార్ట్ మొబైల్స్‌..! స్పెసిఫికేషన్స్‌ ఏ విధంగా ఉన్నాయంటే..?

Mobiles Launched: చాలామంది మొబైల్‌ వినియోగదారులు ప్రస్తుతం ఫెస్టివల్‌ ఆఫర్ల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటించాయి.

ఈ నెలలో లాంచ్‌కానున్న 4 స్మార్ట్ మొబైల్స్‌..! స్పెసిఫికేషన్స్‌ ఏ విధంగా ఉన్నాయంటే..?
Google Pixel

Mobiles Launched: చాలామంది మొబైల్‌ వినియోగదారులు ప్రస్తుతం ఫెస్టివల్‌ ఆఫర్ల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటించాయి. మరోవైపు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌ ఫెస్టివల్‌ సేల్స్‌ని నిర్వహిస్తున్నాయి. డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో 4 కొత్త స్మార్ట్ ఫోన్‌లు ఈ నెలలో విడుదలకాబోతున్నాయి. వాటి ఫీచర్లు, ధర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. oneplus t Series
భారతదేశంలో వన్‌ప్లస్ కొత్త సిరీస్‌ను ప్రారంభించింది. టి సిరీస్‌ని ప్రవేశపెట్టింది. లీక్స్ నివేదిక ప్రకారం.. OnePlus 9RT బ్యాక్ ప్యానెల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే ముందు భాగంలో16 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 870 చిప్‌సెట్‌తో నాక్ అవుతుంది. ఈ ఫోన్‌లో 4500 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. ధర ఇంకా వెలువడలేదు.

2. samsung S21 FE
ఈ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ చివరలో లాంచ్ చేయవచ్చు. ఈ మొబైల్ 6.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఫుల్‌హెచ్‌డి ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే. దీని రిఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఉపయోగించారు. 6 GB, 8 GB RAM ఎంపికలు ఇందులో చూడవచ్చు. ఇది 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. ధర నిర్ణయించలేదు.

3. Google Pixel 6
గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్ కూడా త్వరలో లాంచ్ అవుతుంది. 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఈ ఫోన్‌లో చూడవచ్చు. అలాగే Google ప్రాసెసర్‌ని ఇందులో ఉపయోగించారు. 8 GB RAMతో వస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఇందులో ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.

4. Asus 8Z
ఈ ఆసుస్ స్మార్ట్‌ఫోన్ 5.9-అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 888 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తోంది.16 GB వరకు ర్యామ్ ఉంటుంది. అలాగే వెనుక ప్యానెల్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంటుంది. అయితే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా అందించారు. అధికారిక లాంచ్ గురించి కంపెనీ సమాచారం లేప్పటికీ టెక్ ప్రపంచం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఈ నెలలో లాంచ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉన్నాయి.

Samantha- Naga Chaitanya Divorce: సమంత చైతన్య విడాకుల పై నాగార్జున ఎమోషనల్ రియాక్షన్.. హృదయం బరువెక్కిందంటూ..

Crime News: పొలం పనుల కోసం వెళ్లి శవమై కనిపించిన నలుగురు కుటుంబసభ్యులు.. పోలీసుల విచారణలో సంచలనాలు!

Aadhaar: UIDAI మరో ప్రకటన.. కొత్తగా 166 ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు.. ఇక్కడ ఏ పనులు జరుగుతాయంటే..?

Click on your DTH Provider to Add TV9 Telugu