BharatPe: ఫోన్ పే లో వాటాలు అమ్మే ప్రయత్నాల్లో సహవ్యవస్థాపకుడు..
Bharat Pe News: ఫిన్ టెక్ కంపెనీ భారత్ పే పేమెంట్స్ సంస్థ అకౌంట్లలో కొన్ని అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ప్రత్యేక సంస్థతో ఆడిట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ పే సహ వ్యవస్థాపకుడు అషనీర్ గ్రోవర్ తన 9.5 శాతం వాటాలను అమ్మేందుకు పావులు కదుపుతున్నారు.
Bharat Pe News: ఫిన్ టెక్ కంపెనీ భారత్ పే పేమెంట్స్ సంస్థ అకౌంట్లలో కొన్ని అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ప్రత్యేక సంస్థతో ఆడిట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ పే సహ వ్యవస్థాపకుడు అషనీర్ గ్రోవర్ తన 9.5 శాతం వాటాలను అమ్మేందుకు పావులు కదుపుతున్నారు. తన వాటాలను పూర్తిగా అమ్మేయడం ద్వారా సంస్థ నుంచి పూర్తి స్థాయిలో గ్రోవర్ తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అభియోగాలు రావడంతో సెలవులో ఉన్న సహవ్యవస్థాపకుడు గ్రోవర్.. అప్పట్లో బయటకు వెళ్లడానికి రూ. 4000 కోట్లు డిమాండ్ చేశారు. నెల క్రిందట లీకైన ఒక ఆడియో క్రిప్ తో అసలు ఈ వివాదం మెుదలైంది. తర్డ్ పార్టీ ఆడిట్ పూర్తై రిపోర్టు బోర్టు సభ్యుల ముందుకు రావడానికి ముందుగానే తన వాటాలను అమ్ముకోవాలని అషనీర్ గ్రోవర్ చూస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
వాటాల అమ్మకాల ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్ వరకు గ్రోవర్ కు దక్కుతాయి. కానీ.. గత నెలరోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలను పరిశీలించగా.. వాటాలు కొనేందుకు సరైన ఇన్వెస్టర్ దొరకడం అంత సులువు కాదని సంస్థలోని అంతర్గత వర్గాల నుంచి తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా తక్కువ విలువకు గ్రోవత్ తన వాటాలను అమ్ముకునే అవకాశమూ ఉందని మరికొందరు అంటున్నారు.
గ్రోవర్ ఇప్పటికే వాటాల ఉపసంహరణకు మెుత్తం పెట్టుబడిదారులతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. చట్టపరంగా చిక్కులు ఎదురయ్యే ఉన్నందున ఆయన వాటాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత వాటాదారులలో ఎవరైనా ఫిన్‌టెక్ సంస్థలో ఎక్కువ శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం లేదని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. వాటాల విక్రయానికి సంబంధించి వస్తున్న వార్తలపై వివరాలు తెలుకునేందుకు మీడియా సంస్థ చేసిన ప్రయత్నానికి గ్రోవర్ కానీ, అతిపెద్ద వాటాదారులైన సీక్వోయా క్యాపిటల్ ఇండియా, కోట్యు మేనేజ్‌మెంట్ మరియు రిబ్బిట్ క్యాపిటల్ నిరాకరించాయి.
ఇవీ చదవండి…