Jio Calls, Data Free: రిలయన్స్‌ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు ఉచితంగా కాల్స్‌, డేటా

Jio Calls, Data Free: టెలికం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నెలనెలా జియోకు కస్టమర్లు పెరిగిపోతున్నారు. ఇక ఫిబ్రవరి 5న జియో..

Jio Calls, Data Free: రిలయన్స్‌ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు ఉచితంగా కాల్స్‌, డేటా
Follow us
Subhash Goud

|

Updated on: Feb 08, 2022 | 7:51 PM

Jio Calls, Data Free: టెలికం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నెలనెలా జియోకు కస్టమర్లు పెరిగిపోతున్నారు. ఇక ఫిబ్రవరి 5న జియో నెట్‌వర్క్‌ ఒక్కసారిగా డౌన్‌ అయిన విషయం తెలిసిందే. ముంబై, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో రిలయన్స్‌ జియో సేవలలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది వినియోగదారులు కాల్స్‌ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాల్స్‌ చేసే సమయంలో మీ నెట్‌వర్క్‌లో రిజిస్టర్‌ కాలేదు అనే సందేశం వచ్చినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై జరిగిన అసౌక్యాన్ని చింతిస్తూ జియో తన కస్టమర్లకు రెండు రోజుల పాటు ఉచిత కాలింగ్‌, డేటా సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది.

రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కాలపరిమితిని రెండు రోజలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు రోజుల బెనిఫిట్‌ జియో నెట్‌వర్క్‌ వల్ల అంతరాయం ఏర్పడిన కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయాన్ని రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు ఒక మెసేజ్‌ రూపంలో పంపుతుంది. ఫిబ్రవరి 5న ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిళ్లలో ఈ సమస్య తలెత్తినట్లు యూజర్లు తెలిపారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల పాటు జియోనెట్‌వర్క్‌ సరిగ్గా లేదని కూడా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్‌వర్క్‌ పని చేయడం లేదని సోషల్‌ మీడియాలో సైతం పోస్టులు పెట్టారు. ఏది ఏమైనా రెండు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న కస్టమర్లకు మరో రెండు రోజుల వ్యాలిడిటీ పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Wisdom Teeth: జ్ఞాన దంతాల వల్ల మనిషి మేధస్సు, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందా..? పరిశోధకులు ఏమంటున్నారు?

Home Loan Tax Benefit: హోమ్‌ లోన్‌తో అదిరిపోయే బెనిఫిట్‌.. రూ.5 లక్షల వరకు ఆదా..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే