Home Loan Tax Benefit: హోమ్‌ లోన్‌తో అదిరిపోయే బెనిఫిట్‌.. రూ.5 లక్షల వరకు ఆదా..!

Home Loan Tax Benefit: బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో నిబంధనలు మారుతుంటాయి. బ్యాంకుకు సంబంధించిన వివిధ రకాల రుణ సదుపాయాలలో రూల్స్‌ మారుతుంటాయి. ఇక..

Home Loan Tax Benefit: హోమ్‌ లోన్‌తో అదిరిపోయే బెనిఫిట్‌.. రూ.5 లక్షల వరకు ఆదా..!
Home Loan OD
Follow us

|

Updated on: Feb 08, 2022 | 6:03 PM

Home Loan Tax Benefit: బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో నిబంధనలు మారుతుంటాయి. బ్యాంకుకు సంబంధించిన వివిధ రకాల రుణ సదుపాయాలలో రూల్స్‌ మారుతుంటాయి. ఇక హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి పలు రకాల బెనిఫిట్స్‌ ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు పోటాపోటీగా హోమ్‌ లోన్స్‌ మంజూరు చేస్తున్నాయి. ఇప్పుడు తక్కువ వడ్డీకే హోమ్‌ లోన్‌ పొందవచ్చు. ఇక ఈ లోన్‌ తీసుకోవడం వల్ల ముఖ్యమైన ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి. మీరు కొత్త ఇల్లు కోసం రుణం తీసుకున్నట్లయితే పలు రకాల మినహాయింపులు పొందవచ్చు. మొత్తంగా రూ.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్‌ పొందవచ్చు. వివిధ నివేదికల ప్రకారం..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 24B, సెక్షన్‌ 80C, సెక్షన్‌ 80EEA వంటి ట్యాక్స్‌ మినహాయింపులు పొందవచ్చు. ఇలా అన్నింటిలో రూ.5 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. సెక్షన్ 80C కింద చెల్లించిన రుణ మొత్తంపై రూ.1.5 లక్షలు మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇక సెక్షన్ 24B కింద లోన్‌పై చెల్లించిన వడ్డీ మొత్తంపై రూ.2 లక్షలు మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

అలాగే సెక్షన్‌ 80EEA కింద రుణంలోని వడ్డీపై మరో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ మినహాయింపు పొందవచ్చు. ఈ ప్రయోజనం 31 మార్చి 2022 వరకు మాత్రమే ఉంటుంది. అయితే 1 ఏప్రిల్‌ 2019 – 31 మార్చి 2022 మధ్య తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఇక సెక్షన్‌ 80ఈఈఏ కింద అదనపు ట్యాక్స్‌ బెనిఫిట్‌ పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీరు కొనుగోలు చేసే ఇంటి విలువ రూ.45 లక్షలు మించకూడదు. అంతేకాకుండా మీరు కొనుగోలు చేసిన ఇంటిని ఐదు సంవత్సరాల వరకు విక్రయించకూడదు. అలాగే ఇంటి కొనుగోలుదారుడి పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉండకూడదు. అయితే ఈ బెనిఫిట్స్‌ పొందవచ్చని బిజినెస్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

India Post Payments Bank: మీకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? మార్చి 5 నుంచి కొత్త నిబంధన!

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. మీ అకౌంట్‌కు నామినీ పేరు చేర్చలేదా..? రూ.7 లక్షలు కోల్పోయినట్టే..!