India Post Payments Bank: మీకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? మార్చి 5 నుంచి కొత్త నిబంధన!

India Post Payments Bank: మీరు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ( IPPB ) లో సేవింగ్స్ ఖాతాను తెరిచి ఉంటే ఈ వార్త మీ కోసమే. IPPB డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలను..

India Post Payments Bank: మీకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? మార్చి 5 నుంచి కొత్త నిబంధన!
Follow us

|

Updated on: Feb 08, 2022 | 4:15 PM

India Post Payments Bank: మీరు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ( IPPB ) లో సేవింగ్స్ ఖాతాను తెరిచి ఉంటే ఈ వార్త మీ కోసమే. IPPB డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. ఈ ఛార్జీ రూ. 150తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్‌ 5 మార్చి 2022 నుండి అమల్లోకి వస్తుంది. ఐపీపీబీ వివరాల ప్రకారం.. నాన్-KYC అప్‌డేషన్ కారణంగా డిజిటల్ సేవింగ్స్ ఖాతాను ఒక సంవత్సరం తర్వాత మూసివేస్తే ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ యాజమాన్యంలో ఉన్న ఇండియా పోస్ట్ విభాగం. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 1, 2022 నుండి పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ వడ్డీ రేటును 0.25 శాతం వరకు తగ్గించింది. పొదుపు ఖాతాలో రూ. 1 లక్ష బ్యాలెన్స్‌పై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 2.50 శాతం ఉండగా, ఇప్పుడు అది 2.25 శాతానికి తగ్గింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం .. ఏ అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందడానికి ఏదైనా IPPB యాక్సెస్ పాయింట్‌ని సందర్శించడం ద్వారా 1 సంవత్సరంలోపు మీ డిజిటల్ సేవింగ్స్ ఖాతాను సాధారణ పొదుపు ఖాతాగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా

ఆధార్, పాన్ కార్డ్ కలిగి ఉన్న 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరవవచ్చు. నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను తెరవవచ్చు. ఫిబ్రవరి 1, 2022 నుండి ఖాతాపై వడ్డీ రేటు 2.25 శాతం.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

► ఖాతాదారుడు 12 నెలల్లోపు KYC ప్రక్రియను పూర్తి చేయాలి.

► KYC ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత డిజిటల్ సేవింగ్స్ ఖాతా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాగా అప్‌గ్రేడ్ చేయబడుతుంది.

► ఇందులో మీరు గరిష్టంగా 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు.

► ఖాతా తెరిచిన 12 నెలలలోపు KYC పూర్తి చేయకపోతే ఖాతా మూసివేయబడుతుంది.

► 12 నెలల్లోపు KYC పూర్తి చేసిన తర్వాత, డిజిటల్ సేవింగ్స్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA)తో లింక్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. మీ అకౌంట్‌కు నామినీ పేరు చేర్చలేదా..? రూ.7 లక్షలు కోల్పోయినట్టే..!

Hyundai Tweets: కశ్మీర్ విషయంపై వివాదంగా మారిన ఆ కంపెనీల ట్వీట్లు.. దక్షిణ కొరియా అంబాసిడర్ కు భారత్ సమన్లు..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు