Maruti Suzuki: కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనో కారు.. బుకింగ్ ప్రారంభం..!
Maruti Suzuki: దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) మార్కెట్లో తమ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ ల ద్వారా..
Maruti Suzuki: దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) మార్కెట్లో తమ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ ల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో (Baleno) లో కంపెనీ ఓ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త 2022 మోడల్ బాలెనో కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. టీజర్ ఇమేజ్‌లో కారు తాజా రీడిజైన్ ఆకట్టుకునేలా ఉంది. గతంలో కంటే బాలెనో వైడర్ లుక్‌తో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా ఉంది. హెడ్స్ ఆఫ్ డిస్‌ప్లే (Head-up Display) వంటి సరికొత్త ఫీచర్స్‌ను జోడించింది. నెక్సా డీలర్లతో పాటు నెక్సా వెబ్‌సైట్‌లో రూ 11,000 చెల్లించి బాలెనోను కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్స్‌తో పాటు ఇందులో రిఫ్రెఫ్డ్ డిజైన్, కొత్త ఇంటీరియర్లను కూడా జోడించింది. కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో మారుతి సుజుకీ బాలెనో కొత్త ఫీచర్స్ హెడ్స్ అప్ డిస్‌ప్లే నుకంపెనీ హైలెట్ చేసింది. బాలెనో దేశంలో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అప్‌డేటెడ్ ఫీచర్లు, అనేక భద్రతా పరికరాలతో తీసుకువచ్చింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్‌లు కూడా ఉంటాయని అంచనా ఉంది.
కారు ధర..
ఈ కారు రూ 6.14 లక్షల నుంచి రూ.9.66 లక్షలు (ఎక్స్-షోరూం) మధ్య అందుబాటులో ఉంటుంది. న్యూ ఏజ్ బాలెనో టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20లకు ధీటైన పోటీ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది.
ఇవి కూడా చదవండి: