Self Driving Car: వారెవ్వా.. ఈ కారుకు డ్రైవరే అక్కర్లేదు.. కూర్చుంటే చాలు అదే తీసుకెళ్తుంది.. ఫీచర్లు, లుక్ మామూలుగా లేవుగా..

అత్యంత ఆధునిక ఫీచర్లతో ప్యూగోట్ కంపెనీ ఇన్సెప్షన్ కాన్సెప్ట్ కారును కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈసీ)లో ప్రదర్శించింది. స్వీయ డ్రైవింగ్ శ్రేణిలో విశేష అనుభూతిని అందిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది.

Self Driving Car: వారెవ్వా.. ఈ కారుకు డ్రైవరే అక్కర్లేదు.. కూర్చుంటే చాలు అదే తీసుకెళ్తుంది.. ఫీచర్లు, లుక్ మామూలుగా లేవుగా..
Peugeot
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 13, 2023 | 6:56 PM

సెల్ప్ డ్రైవింగ్ మోడ్ కలిగిన హై ఎండ్ కార్లు ఇటీవల కాలంలో ఎక్కువ వస్తున్నాయి. వాటిల్లో మరింత సమర్థంగా.. అత్యంత ఆధునిక ఫీచర్లతో ప్యూగోట్ కంపెనీ ఇన్సెప్షన్ కాన్సెప్ట్ కారును కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈసీ)లో ప్రదర్శించింది. స్వీయ డ్రైవింగ్ శ్రేణిలో విశేష అనుభూతిని అందిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఇప్పుడు చూద్దాం..

ఆటో డ్రైవ్..

ఫ్రెంచ్ కు చెందిన ఈ ప్యూగోట్ కంపెనీ తన నెక్ట్స్ జనరేషన్ కారును ఆవిష్కరించింది. ఆటో డ్రైవ్ ఆప్షన్ తో వస్తున్న ఈ కారులో ఐ కాక్ పిట్ ఉంటుంది. సెల్లాంటిస్ ఎస్టీఎల్ఏ స్మార్ట్ కాక్ పిట్ టెక్నాలజీని వినియోగించుకుంది. దీనిలో లెవెల్ 4 ఆటోనామస్ డ్రైవింగ్ సాంకేతికతో వస్తుంది. లెవెల్ 4 అంటే కొన్న ప్రదేశాల్లో ఈ కారు ఆటోమేటిక్ తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది.

వీడియో గేమ్స్ సాంకేతికతతో..

ఈ కారులోని మరో ఆసక్తి కర విషయం ఏమిటంటే హైపర్ స్క్వేర్ కంట్రోల్ సిస్టం. ఇది వీడియోగేమ్స్ వాడే స్టీర్ బై వైర్ టెక్నాలజీని వినియోగించుకొని దీనిని అభివృద్ధి చేశారు. ఈ కారు 2026 నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

స్పెసిఫికేషన్లు ఇలా..

ప్యూగోట్ అత్యాధునిక కారులో 100kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 497 మైళ్ల రేంజ్ ను అందిస్తుంది. దీనిలో రెండు మోటార్లు ఉంటాయి. రెండూ కలిపి 680 హార్స్ పవర్ ను అందిస్తాయి. ఈ కారు మూడు సెకన్లలో గంటకు 0 నుంచి 62 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. వైర్ లెస్ ఇండక్షన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..