AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ఇక పెట్రోల్ బైక్‌లు, స్కూటర్లపై నిషేధం.. 2028 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలే..!

Delhi: ఇక రాబోయే రెండేళ్లలో పెట్రోల్‌, బైక్‌లు, స్కూటర్లు కనుమరుగు అవుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్‌తో నడిచే స్కూటర్లు, బైక్‌లు, ఆటోలను నిషేధం కానున్నాయి. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. దీనిపై ప్రభుత్వం..

Delhi: ఇక పెట్రోల్ బైక్‌లు, స్కూటర్లపై నిషేధం.. 2028 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలే..!
Bikes
Subhash Goud
|

Updated on: Apr 19, 2026 | 12:52 PM

Share

Delhi: ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీ గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమైంది. ‘ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030’ ముసాయిదా ప్రకారం.. రాబోయే రెండేళ్లలో పెట్రోల్ టూ-వీలర్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసి, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

ఏ వాహనం ఎప్పటి నుండి నిలిపివేస్తారు?

ప్రజలు, నిపుణుల సలహాల కోసం విడుదల చేసిన ఈ డ్రాఫ్ట్ ప్రకారం గడువు ఇలా ఉంది.

ఇవి కూడా చదవండి

పెట్రోల్ బైక్‌లు, స్కూటర్లు: ఏప్రిల్ 1, 2028 నుండి ఢిల్లీలో కొత్త పెట్రోల్ లేదా CNG ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయబడతాయి. ఆ తర్వాత కేవలం ఎలక్ట్రిక్ బైక్‌లు మాత్రమే కొనాలి.

ఆటోలు (త్రీ-వీలర్స్): జనవరి 1, 2027 నుండే కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు కేవలం ఎలక్ట్రిక్ విభాగంలోనే జరుగుతాయి. డెలివరీ సంస్థలు, టాక్సీ సేవలకు ఈ నిబంధనలు ఇంకా ముందే అమలులోకి వస్తాయి.

ముఖ్య గమనిక: ఇప్పటికే ఉన్న పెట్రోల్ వాహనాలపై తక్షణ నిషేధం ఏమీ ఉండదు. అవి వాటి గడువు ముగిసే వరకు తిరుగుతాయి. కేవలం కొత్త వాహనాల కొనుగోలుపైనే ఈ నిబంధన వర్తిస్తుంది.

ఎందుకు ఈ కఠిన నిర్ణయం?

ఢిల్లీలోని మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాల వాటా సుమారు 67%. అంటే రోడ్డుపై వెళ్లే ప్రతి 100 వాహనాల్లో 67 బైక్‌లే ఉంటున్నాయి. వాహన కాలుష్యంలో వీటి వాటానే అత్యధికం కాబట్టి, ముందుగా వీటిని ఎలక్ట్రిక్ వైపు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు:

ప్రజలు స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం భారీ ఆఫర్లను ప్రకటించింది. సబ్సిడీ: బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ద్విచక్ర వాహనాలపై భారీ సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే కార్లపై రాయితీ కూడా ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ కార్లపై రూ.1 లక్ష వరకు రాయితీ. పన్ను మినహాయింపు సదుపాయం కూడా ఉంది. రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100% మినహాయింపు. స్క్రాపింగ్ బెనిఫిట్ కూడా ఉంది. పాత వాహనాలను తుక్కుగా మార్చిన వారికి రూ. 10,000 నుండి రూ. 1 లక్ష వరకు ప్రయోజనం.

మౌలిక సదుపాయాల కల్పన:

చార్జింగ్ సమస్య తలెత్తకుండా ఢిల్లీ ట్రాన్స్‌కో (Delhi Transco) ఆధ్వర్యంలో నగరం అంతటా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వాహన డీలర్‌షిప్ వద్ద కూడా చార్జింగ్ పాయింట్లు ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే పాత బ్యాటరీల వల్ల కాలుష్యం కలగకుండా రీసైక్లింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తారు.

LED Credit Cards: పేమెంట్ చేయగానే వెలిగే క్రెడిట్ కార్డ్.. భారత్‌లో తొలిసారిగా ‘LED క్రెడిట్ కార్డ్’.. దీని ప్రత్యేకతలు ఇవే!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నట్లుగా ఈ నిర్ణయం కేవలం పర్యావరణం కోసమే కాకుండా, ప్రజల ఆరోగ్యం, సుస్థిరమైన రవాణా వ్యవస్థ కోసం తీసుకున్న పెద్ద అడుగు. ఢిల్లీ గాలిని శుభ్రం చేయాలంటే టూ-వీలర్ల విద్యుదీకరణే ఏకైక మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Jasmine Plants: ఇంటి ఆవరణలో మల్లెపూల చెట్టు ఉంటే వాసనకు పాములు వస్తాయా? ఇది నిజమేనా?

Personal Finance: కేవలం రూ.1000తో మొదలు పెట్టండి.. ఐదేళ్లలో రూ.10 లక్షలు మీ సొంతం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో