AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. గతంలో ఉన్న ధరలను పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి..

Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!
Gold, Silver Rates
Subhash Goud
|

Updated on: Apr 19, 2026 | 11:05 AM

Share

Gold, Silver Prices: గత వారంలో బంగారం, వెండి ధరలలో గణనీయమైన మార్పు కనిపించింది. ఈ రెండు విలువైన లోహాల ధరలు పెరిగాయి. అయితే, ఐదు రోజుల పెరుగుదల తర్వాత కూడా MCXలో బంగారం ధర దాని ఆల్-టైమ్ హై కంటే 10 గ్రాములకు రూ.48,000 పైగా తక్కువగా ఉంది. వెండి ధర కూడా దాని ఆల్-టైమ్ హై కంటే రూ.1.81 లక్షలు తక్కువగా ఉంది. గత ఐదు ట్రేడింగ్ రోజులలో 1 కిలో వెండి ధర రూ.14,000 పైగా పడిపోయింది.

ముందుగా వెండి ధర గురించి మాట్లాడుకుందాం.. మే 5వ తేదీన గడువు ముగియనున్న MCXలోని వెండి ధర గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో రూ.14,805 పెరిగింది. ఏప్రిల్ 10న 1 కిలో వెండి ధర రూ.2,43,274 ఉండగా, గత శుక్రవారం అది కిలోకు రూ.2,58,079 వద్ద ముగిసింది.

వారం రోజుల పాటు పెరిగినప్పటికీ, వెండి ధరలు దాని గరిష్ట స్థాయిలతో పోలిస్తే పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో MCXలో వెండి ఫ్యూచర్స్ తొలిసారిగా రూ. 4 లక్షలను దాటాయి. అలాగే ఈ విలువైన లోహం కిలోకు రూ. 4,39,337 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. ఈ స్థాయికి చేరుకున్నప్పటి నుండి తగ్గుతూ,కిలోకు రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Personal Finance: కేవలం రూ.1000తో మొదలు పెట్టండి.. ఐదేళ్లలో రూ.10 లక్షలు మీ సొంతం!

గత వారం బంగారం కూడా..

ఈ గత వారంలో బంగారం కూడా పెరిగింది. ఏప్రిల్ 10న MCXలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,52,652 వద్ద ముగియగా, గత శుక్రవారం అది రూ.1,54,605కు ఎగబాకింది. ఈ విధంగా ఒక వారంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,953 మేర పెరిగింది.

వెండి లాగే జనవరిలో బంగారం ధరలు కూడా భారీగా పెరిగి, తొలిసారిగా 10 గ్రాములకు రూ.2 లక్షల మార్కును అధిగమించాయి. MCX ఎక్స్ఛేంజ్‌లో ఈ విలువైన పసుపు లోహం జీవితకాల గరిష్ఠ స్థాయి 10 గ్రాములకు రూ.2,02,984గా ఉంది. ఈ స్థాయిని ప్రస్తుత ధరతో పోల్చి చూస్తే, బంగారం రూ.48,379 వరకు పడిపోయింది.

Real Estate: గృహ కొనుగోలుదారులకు పెద్ద ఎదురుదెబ్బ.. ఒక్క ప్రభుత్వ నిర్ణయంతో రాత్రికి రాత్రే భారీగా పెరిగిన ధరలు!

Fact Check: పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి RBI కొత్త రూల్స్ తెచ్చిందా? అసలు విషయం చెప్పిన కేంద్రం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే