Gold Price Today: అక్షయ తృతీయ.. బంగారం, వెండి ధరలు తగ్గాయా? పెరిగాయా? హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
Gold Price Today: పండుగ సీజన్ కావడంతో నగల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు బంగారం కొనాలనుకుంటే హాల్‌మార్క్ (BIS Hallmark) ఉన్న నగలను మాత్రమే ఎంచుకోండి. ఇది మీరు కొనే బంగారం నాణ్యతకు గ్యారెంటీ ఇస్తుంది..

Gold Price Today: బంగారం ధరలకు యుద్ధం సెగ గట్టిగానే తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిలకడగా ఉన్న ధరలు భవిష్యత్తులో తీవ్ర ఊగిసలాట భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధిలో మందగమనం, మారుతున్న ద్రవ్య విధాన అంచనాల నేపథ్యంలో 2026లో బులియన్ మార్కెట్లో అస్థిరంగానే ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఏప్రిల్ 19వ తేదీన ఆదివారం సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ వేడుకల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. అక్షయ తృతీయ కారణంగా బంగారం షాపులు మహిళలతో కిటకిటలాడుతాయి. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదని నమ్ముతుంటారు. అందుకే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఇక మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానముంది. పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇది కూడా చదవండి: Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,800 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,800 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,930 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,950 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,800 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,660 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,600 వద్ద ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,800 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. ఇతర నగరాల్లో రూ.2,75,000 వద్ద ట్రేడవుతోంది.
అక్షయ తృతీయ ప్రభావం: పండుగ సీజన్ కావడంతో నగల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
అదనపు ఛార్జీలు: పైన పేర్కొన్న ధరలు బులియన్ మార్కెట్ ధరలు మాత్రమే. మీరు నగలు కొనుగోలు చేసేటప్పుడు వీటికి GST (3%), మేకింగ్ ఛార్జీలు (తరుగు) అదనంగా ఉంటాయని గుర్తుంచుకోండి.
ధరల మార్పు: అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువపై ఆధారపడి ధరలు రోజులో ఎప్పుడైనా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు బంగారం కొనాలనుకుంటే హాల్‌మార్క్ (BIS Hallmark) ఉన్న నగలను మాత్రమే ఎంచుకోండి. ఇది మీరు కొనే బంగారం నాణ్యతకు గ్యారెంటీ ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




