Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలు.. కొన్ని ప్రాంతాల్లో మార్పులు

Petrol, Diesel Rates Today: దేశంలో చమురు ధరలకు కొంచెం బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు కొంతమేర ఉపశమనం కలిగినట్లయింది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్

Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలు.. కొన్ని ప్రాంతాల్లో మార్పులు
petrol diesel prices
Follow us

|

Updated on: Apr 27, 2021 | 6:43 AM

Petrol, Diesel Rates Today: దేశంలో చమురు ధరలకు కొంచెం బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు కొంతమేర ఉపశమనం కలిగినట్లయింది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరినుంచి ఆందోళన వక్తమైంది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది.

కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలు మరికొన్ని చోట్లనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99  ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.05 ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.08 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.12గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.62 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.14 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.60 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.14 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.77 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.22గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

Also Read:

Corona Pandemic: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కలిసి పనిచేస్తాం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోడీ సంయుక్త నిర్ణయం

లాక్ డౌన్ విధింపు, ఆంక్షలపై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు, పరిస్థితిని బట్టి నిర్ణయాలు