Petrol Diesel Price: పండుగ సమయంలోనూ బాదుడే.. బాదుడు.. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందో తెలుసా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటలు ఆగడం లేదు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు..

Petrol Diesel Price: పండుగ సమయంలోనూ బాదుడే.. బాదుడు.. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందో తెలుసా..
Petrol Diesel Prices
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 16, 2021 | 8:08 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటలు ఆగడం లేదు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. శనివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.37గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 102.42గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.70గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.102.72గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.51గా ఉండగా.. డీజిల్ ధర రూ. 102.53గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.82గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.37 ఉండగా.. డీజిల్ ధర రూ.102.42గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.09పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.15గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.04 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.44 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.99 ఉండగా.. డీజిల్ ధర రూ. 103.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.88 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.33గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.69గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.14గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 112.04 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.104.44లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 105.49 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.22 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.43కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.15 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.10 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.88 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.80 ఉండగా.. డీజిల్ ధర రూ.98.69గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.109.16పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.100గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.49 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.66గా ఉంది.

ఇవి కూడా చదవండి: Crocodile: 13 అడుగుల భారీ మొసలిని పట్టుకున్న వేటగాడు.. కడుపులో 5 వేల ఏళ్లనాటి బాణం..

Devaragattu Bunni Festival: దేవరగట్టు కర్రల సమరంలో పగిలిన తలలు.. 100 మందికిపైగా గాయాలు..