Sliver Rates: బంగారం దారిలోనే వెండి.. పెరిగిన సిల్వర్ రేట్.. కిలో వెండి ఎంతుందంటే..
Sliver Rates: పండుగ, శుభకార్యాలు వెరసి బంగారం, వెండి ధరలకు దారి తీసినట్లు కనిపిస్తోంది. శుభాకార్యాలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో బంగారం, వెండి కోనుగోలు పెరుగుతున్నాయి. ఇది వాటి ధరపై ప్రభావం..
Sliver Rates: పండుగ, శుభకార్యాలు వెరసి బంగారం, వెండి ధరలకు దారి తీసినట్లు కనిపిస్తోంది. శుభాకార్యాలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో బంగారం, వెండి కోనుగోలు పెరుగుతున్నాయి. ఇది వాటి ధరపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా దీపావళి నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ కొనుగోలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బంగారం దారిలోనే వెండి కూడా ప్రయణించినట్లు కనిపిస్తోంది.
శనివారం దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా పెరిగియాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,600 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ కిలో సిల్వర్ ధర రూ. 63,600 వద్ద ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,700 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో సిల్వర్ రేట్ రూ. 63,600 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర ఎలా ఉందంటే..
* హైదారాబాద్‌లో శనివారం వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ కేజీ సిల్వర్ ధర రూ. 67,700 గా ఉంది.
* విజయవాడ విషయానికొస్తే ఇక్కడ శనివారం కిలో వెండి ధర రూ. 67,700 గా ఉంది.
* ఇక సాగర తీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 667,700 వద్ద కొనసాగుతోంది.
Tree Top Hotel: అచ్చం పక్షిగూడులా..! అద్భుతమైన హోటల్.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!(వీడియో)
CM KCR: సీఎం ఇంటా విజయ దశమి వేడుకలు.. ఆయుధ, వాహన పూజ చేసిన కేసీఆర్.. పాల్గొన్న కుటుంబ సభ్యులు..