Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న మార్పులు..

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల్లో భారీ ప్రభావం కనిపించకున్నా.. కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని చోట్ల కొద్దిగా పెరిగాయి. ఇదిలాఉంటే..కేంద్రం తగ్గించినా.. తెలుగురాష్ట్రాలు ఎందుకు ఫాలో కావడం లేదని ఆందోళనబాటు పడుతున్నాయి విపక్షాలు.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.59గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.97గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.44గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.84గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.46 ఉండగా.. డీజిల్ ధర రూ.94.86గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.65కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.69లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.90 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.97గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.36లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.65గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.86గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.65 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.69లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: శత్రువును ద్వేషించకు స్నేహితుడిలా చూడు.. చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే..
Demonetization: నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా.. ఆభివృద్ధికి ఏమేర దోహదపడింది.. అసలేం జరిగింది..