AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా..? ఈ 3 పనులు చేస్తే చాలు మీరు సేఫ్

క్రెడిట్ కార్డ్ సరిగ్గా వాడటం తెలిస్తే దాని వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. కానీ వాటి గురించి అవగాహన లేకుండా వాడి చివరికి అప్పులపాలు కావాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు తీసుకునేముందే ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. అవేంటో ఓ లుక్కేయండి.

Credit Card: క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా..? ఈ 3 పనులు చేస్తే చాలు మీరు సేఫ్
Credit Card
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2025 | 3:25 PM

Share

Credit Card Usage: ఇప్పటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడనివారంటూ ఎవరూ కనిపించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బుల కోసమో.. లేదా ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసమో.. ప్రతీఒక్కరూ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు. దీంతో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగిపోయింది. ఎవరి వద్ద చూసినా ఏదోక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది. క్రెడిట్ కార్డు ఉండటం మంచిదే.. క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చులపై 45 రోజుల పాటు ఎలాంటి వడ్డీ ఉండదు. కానీ క్రెడిట్ కార్డు ఎలా పడితే అలా వాడితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. దీంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బిల్లు టైమ్‌కి కట్టండి

క్రెడిట్ కార్డు బిల్లు ఆన్ టైమ్‌లో కట్టాలి. ఆలస్యంగా కడితే భారీగా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు అంటూ అనేక ఛార్జీలు వేస్తున్నాయి. 36 శాతం నుంచి 42 శాతం వరకు ఈ ఛార్జీలు ఉంటున్నాయి. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశముంది. వీటి నుంచి తప్పించుకోవాలంటే బిల్లు డ్యూ డేట్ కంటే ముందు చెల్లించండి. అదీ కూడా వీలుకాకపోతే మినిమం డ్యూ చెల్లించండి. దీని వల్ల ఛార్జీలు పడవు.

ఈఎంఐ ఆప్షన్

క్రెడిట్ కార్డు ద్వారా మీరు చేసే ఖర్చులను ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. మీరు ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సక్షన్స్ చేసినా ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఒకేసారి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఈఎంఐ రూపంలో ప్రతీనెలా కొంతకొంత చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డులు వాడేవారికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగపడుతుంది.

గ్రేస్ పీరియడ్

క్రెడిట్ కార్డువాడేవారు గ్రేస్ పీరియడ్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీకు క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చిన టైమ్ నుంచి మీ పేమెంట్ డ్యూ డేట్‌కి మధ్య ఉన్న కాలాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. ఈ మధ్య కాలంలో మీరు పూర్తి బిల్లు చేల్లిస్తే కొనుగోళ్లపై ఎలాంటి వడ్డీ ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్