తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలకు 18 ఏళ్లు నిండాయా.. ? ఈ పనులు తప్పనిసరి
18 సంవత్సరాలు దాటాయంటే చాలు.. ఇండియాలో పిల్లలను చట్టపరంగా మేజర్‌గా పరిగణిస్తారు. దీని ద్వారా వాళ్లు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. చట్టపరంగా వారికి అనేక హక్కులు సంక్రమిస్తాయి. 18 ఏళ్లు నిండిన పిల్లలు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పిల్లలకు 18 ఏళ్లు నిండగానే చట్టపరంగా మైనర్ దశ నుంచి మేజర్‌గా మారతారు. దీంతో వారు చట్టపరంగా ఆర్ధికంగా, స్వతంత్రంగా అనేక సౌకర్యాలు, సదుపాయాలకు అర్హత సాధిస్తారు. అప్పటివరకు తల్లిదండ్రులపై ఆధారపడిన పిల్లలు.. సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసునేందుకు సిద్దమవుతారు. వీటి పట్ల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండి పిల్లలకు సహకరించాల్సిన అవసరముంది. 18 ఏళ్లు నిండగానే పిల్లలు ఏం చేయాలి.? తల్లిదండ్రులు ఎలాంటి చొరవ తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పాన్ కార్డ్, ఓటర్ కార్డ్
18 ఏళ్లు నిండగానే పిల్లలు తప్పనిసరిగా పాన్ కార్డు తీసుకోవాలి. ఈ రోజుల్లో పాన్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అవసరమే. 18 ఏళ్లు నిండినవారు చట్టబద్దంగా ఆర్ధిక లావాదేవీలు చేయొచ్చు. దీని కోసం పాన్ కార్డు అనేది అవసరం కాబట్టి.. వెంటనే తీసుకోవాలి. దీంతో పాటు ఓటుకు అప్లై చేసుకుని కార్డు తీసుకోవాలి.
బ్యాంక్ అకౌంట్‌లో మార్పులు
18 ఏళ్ల నిండిన తర్వాత పిల్లలకు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిర అవసరముంది. పిల్లలు మైనర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిపి జాయింట్ అకౌంట్ తీసుకుని ఉంటారు. దానిని వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాగా మార్చాలి. అందులో కొంతమొత్తంలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే వారి అసవరాలకు ఉపయోగపడతాయి.
హెల్త్ ఇన్స్యూరెన్స్
పిల్లలు మైనర్‌గా ఉన్నప్పుడు వారి పేరు మీద హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ వంటికి కొనుగోలు చేయడానికి కుదరదు. దీంతో వారు మేజర్ అయ్యాక వారి పేరుపై హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం మంచిది. వారి ఆరోగ్యానికి మీరు భరోసా కల్పించినవారు అవుతారు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి
18 ఏళ్లు నిండాక వారికి పెట్టుబడి పెట్టడం నేర్పించండి. మీ పేరుపై ఉన్న షేర్లను వారికి బదిలీ చేయండి. లేకపోతే రిస్క్ తక్కువ ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వారికి దగ్గర ఉండి చూపించండి. దీని వల్ల వారికి సేవింగ్స్, ఆర్ధిక విషయాలపై చిన్న వయస్సుల్లోనే అవగాహన ఏర్పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
