AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Labour Codes: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి మరింత భరోసా కల్పిస్తూ కొత్త లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్, టైమ్‌కి శాలరీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి ఎన్నో బెనిఫిట్స్ వీటి ద్వారా లభించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

New Labour Codes: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
Labour Codes
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2025 | 4:37 PM

Share

కార్మికుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మికులకు భరోసా కల్పించేందుకు దేశంలో కొత్త లేబర్ కోడ్‌లు తీసుకొచ్చింది. నవంబర్ 21 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తన ఎక్స్ ఖాతాల్లో తెలిపారు. కార్మికులకు సకాలంలో కనీస వేతనాలు చెల్లించడంతో పాటు అపాయింట్‌మెంట్స్ లెటర్స్ ఇవ్వాలని సూచించింది. ఇక పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన వేతనంతో పాటు గౌరవం కల్పించాలని తెలిపింది. ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు ఒక సంవత్సరం తర్వాత గ్రాట్యూటీ సౌకర్యం కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది.

40 ఏళ్లు పైబడిన కార్మికులకు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా హెల్త్ చెకప్, ఓవర్ టైమ్ పనిచేసినవారికి డబుల్ వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 100 శాతం ఆరోగ్య భద్రత, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం కల్పిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని తెలిపింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త లేబర్ కోడ్స్ కార్మికులకు భద్రత కల్పిస్తాయని మాండవీయ స్పష్టం చేశారు.

నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వేతనాల నియమావళి, 2019, పారిశ్రామిక సంబంధాల నియమావళి 2020, సామాజిక భద్రత కోడ్, 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం , పని పరిస్థితుల కోడ్, 2020లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్, పీఎఫ్, ఈఎస్‌ఐసీ, ఇన్స్యూరెన్స్ వంటివి కల్పించాలని సూచించింది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్