AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్.. తగ్గనున్న వడ్డీ రేట్లు.. వారికి సూపర్ బెనిఫిట్

తాజాగా ఆర్బీఐ కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చింది. అదేంటి అంటే.. హోమ్ లోన్ తీసుకున్నాక మీ సిబిల్ స్కోర్ పెరిగితే.. మీకు వడ్డీ కూడా తగ్గుతుంది. గతంలో మూడేళ్లలో తగ్గించాలనే నిబంధనలను ఇప్పుడు ఆర్బీఐ తొలగించింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్.. తగ్గనున్న వడ్డీ రేట్లు.. వారికి సూపర్ బెనిఫిట్
Rbi
Venkatrao Lella
|

Updated on: Nov 28, 2025 | 9:14 PM

Share

Home Loan: ప్రజలకు ఉపయోగపడేలా ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తుంది. లోన్ల వడ్డీ రేట్లను తగ్గించేలా నిర్ణయాలను తీసుకుంటుంది. దీని వల్ల బ్యాంకు నుంచి లోన్లు తీసుకునేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తాజాగా హోమ్ లోన్లకు సంబంధించి ఆర్‌బీఐ  కొత్త రూల్ ప్రవేశపెట్టింది. దీని వల్ల హోమ్ లోన్ తీసుకున్నవారికి వడ్డీ రేట్లు తగ్గి బెనిఫిట్ జరగనుంది. ఆర్‌బీఐ తెచ్చిన ఆ కొత్త రూల్ ఏంటి..? కస్టమర్లకు ఎంటి ప్రయోజనం జరగనుంది? అనే విషయాలు ఇఫ్పుడు చూద్దాం.

చాలామంది కొత్త ఇంటి నిర్మాణం లేదా పూర్తైన ఇంటిని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. హోమ్ లోన్ తీసుకుున్నప్పుడు ఫ్లోటింగ్ రేటు వడ్డీ ఆప్షన్ ఎంచుకుంటే మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు తగ్గుతుంది. తక్కువగా ఉంటే అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే ఇకపై అలా కుదరదు. ఒకవేళ లోన్ తీసుకున్నాక సిబిల్ స్కోర్ పెరిగితే వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా సవరణ మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో మూడేళ్ల వరకు సిబిల్ స్కోర్ పెరిగినా వడ్డీ తగ్గించేందుకు వీలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మూడేళ్ల వరకు ఆగకుండా ముందే తగ్గించాలి.

ఇందుకుగాను మీ సిబిల్ స్కోర్ పెరిగిన తర్వాత కస్టమర్లు బ్యాంకులను సంప్రదించాలి. తమ సిబిల్ స్కోర్ పెరిగిందని, వడ్డీ రేట్లు తగ్గించాలని రిక్వెస్ట్ పెట్టుకోవాలి. బ్యాంకులు మీ సిబిల్ స్కోర్‌ను పరిశీలించి వడ్డీ రేట్లు తగ్గించాల్సి ఉంటుంది. ఇక బ్యాంకులు లోన్స్‌పై విధించే క్రెడిట్ రిస్క్‌ను కూడా తగ్గించుకుంటే వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న నిబంధనలు ప్రకారం సిబిల్ స్కోర్ లోన్ తీసుకున్న వెంటనే పెరిగినా.. మూడేళ్ల వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ముందే తగ్గించుకునే అవకాశం ఉండటం వల్ల డబ్బులు ఆదా అవుతాయి.