AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Tips: పెట్రోల్ సేవ్ చేద్దామని సిగ్నల్స్ దగ్గర బండి ఆపేస్తున్నారా..? ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు

రెడ్ సిగ్నల్స్ దగ్గర బండి ఆపేస్తే పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గుతుందా..? లేక ఇంజిన్ ఆపేసి మళ్లీ స్టార్ట్ చేయడం వల్ల ఇంధనం అదనంగా ఖర్చు అయి నష్టం జరుగుతుందా..? ఇలాంటి అనుమాలు చాలామందిలో ఉంటాయి. దీనికి సమాధాలు ఇందులో చూద్దాం రండి.

Driving Tips: పెట్రోల్ సేవ్ చేద్దామని సిగ్నల్స్ దగ్గర బండి ఆపేస్తున్నారా..? ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు
Traffic Petrol
Venkatrao Lella
|

Updated on: Nov 28, 2025 | 7:43 PM

Share

పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. దీంతో వీటిని భరించలేక చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్‌ వెహికల్స్ వాడేవారు ఖర్చును తగ్గించుకోడానికి అనేక ఉపాయాలు పాటిస్తున్నారు. మెట్రో సిటీలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో సిగ్నల్స్ వద్ద వేచి ఉండాల్సి వచ్చినప్పుడు పెట్రోల్ ఆదా చేసుకోవడానికి చాలామందికి ఇంజిన్ ఆపేసే అలవాటు ఉంటుంది. ఇక మరికొంతమంది బండి న్యూట్రల్‌లో పెట్టి ఇంజిన్ ఆన్ చేసి ఉంచుతారు. ఇంజిన్ ఆపేసి మళ్లీ ఆన్ చేయడం వల్ల పెట్రోల్ అదనంగా ఖర్చు అవుతుందని మరికొంతమంది భావిస్తున్నారు. అయితతే ఇంజిన్ ఆపేయడం వల్ల పెట్రోల్ లేదా డిజిల్ ఖర్చు తగ్గుతుందా..? లేదా? అనే అనుమానం చాలామంది బైక్, కార్ల వినియోగదారులకు ఉంటుంది. దీని గురించి వివరాలు తెలుసుకుందాం.

బండి ఐడ్లింగ్‌లో(బండి కదలకుండా ఇంజిన్ రన్ అవుతుంది) ఉన్నప్పుడు ఇంజిన్ ఇంధనాన్ని మండిస్తూనే ఉంటుంది. దీని వల్ల బండి కదలకపోయినా ఇంజిన్ రన్ అవుతూ ఉండటం వల్ల ఇంధనం ఖర్చు అవుతూ ఉంటుంది. బైక్‌లు అయితే తక్కువ ఇంధనాన్ని మండిస్తాయి. ఈ సమయంలో ఇంజిన్ పరిమాణం, లోడ్ ఆధారంగా ఇంధన వినియోగం మారుతుంది. ఇటీవల వచ్చే కొత్త వాహనాలు ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌లతో వస్తున్నాయి. ఇంధన వినియోగం తగ్గించడం, ఇంజిన్ ఆపేయడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

ఇంజిన్ తిరిగి స్టార్ట్ చేస్తే..

సిగ్నల్స్ దగ్గర ఇంజిన్ ఆపేసి తిరిగి స్టార్ట్ చేయడం వల్ల ఇంధనం ఖర్చవుతుంది. కానీ 30 నుంచి 60 సెకన్ల కంటే ఎక్కువసేపు బండి ఐడ్లింగ్‌లో ఉన్నప్పుడు ఖర్చయ్యే ఇంధనం కంటే ఇంజిన్ తిరిగి స్టార్ట్ చేయడం వల్ల వినియోగించే ఇంధనం చాలా తక్కువ. దీని వల్ల రెడ్ సిగ్నల్ టైమ్ ఒక నిమిషం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇంజిన్ ఆపేయడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. బైక్‌లు అయితే ఐడ్లింగ్ సమయంలో తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. అందువల్ల సిగ్నల్ సమయం తక్కువ ఉన్నప్పుడు ఇంజిన్ ఆప్ చేయడం ద్వారా ఆదా అయ్యే ఇంధనం తక్కువగా ఉంటుంది.

కార్ల విషయానికొస్తే..

పెట్రోల్ కార్లు ఐడ్లింగ్ సమయంలో ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. అందువల్ల రెడ్ సిగ్నల్స్ ఎక్కువసేపు ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక డీజిల్ వాహనాలు పనిలేకుండా ఉన్న సమయంలో ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. అంతేకాకుండా ఇంజిన్ రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాటరీ, మోటార్లపై ఒత్తిడి పడుతుంది. రెడ్ సిగ్నల్స్ ఎక్కువసేపు ఉంటే తప్పితే డిజిల్ కార్లు వాడేవారు ఇంజిన్ ఆఫ్ చేయకపోవడమే మంచిది.

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే