Investment Ideas: మీరు కోటిశ్వరులు అవ్వాలనుకుంటున్నారా..? ఎవరికి తెలియని సీక్రెట్ ఫార్ములా ఇదే..
చాలామంది డబ్బులు పొదుపు చేసేందుకు అనేక ఐడియాలు పాటిస్తూ ఉంటారు. ఇటీవల చిట్టీలు బాగా పాపులర్ అవ్వగా.. ఇక బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి లాంటివి చాలానే ఉన్నాయి. కానీ ఈ ఫార్ములా పాటించడం వల్ల మీరు కోటి వరకు డబ్బులు సంపాదించోచ్చు.

భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులు పొదుపు చేసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఎంతగా ట్రై చేసినా ఏ నెల డబ్బులు ఆ నెల ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక మరికొంతమంది ప్రతీ నెలా చిట్టీల రూపంలో లేదా బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీస్ స్కీమ్స్ రూపంలో డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక స్టాక్ మార్కెట్ ద్వారా కూడా డబ్బులు పొదుపు చేసుకునే అవకాశం ఉండగా.. అది రిస్క్‌తో కూడుకున్నది. రిస్క్ లేకుండా సొమ్ము పొదుపు చేసుకోవాలనుకుంటే చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మీరు పెట్టుబడి పెడితే మీకు వడ్డీ కూడా వస్తుంది. డబ్బులు ఎక్కువగా పొదుపు చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిల్లో 11-12-20 ఫార్ములా ఇటీవల బాగా పాపులర్ అయింది.
11-12-20 ఫార్ములా ఏంటి అంటే..?
11-12-20 ఫార్ములాలో ఒక్కొ నెంబర్ ఒక్కొ విషయాన్ని తెలియచేస్తుంది. 11 అంటే ప్రతీ నెలా రూ.11 వేలను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) రూపంలో పెట్టుబడి పెట్టాలి. ఇలా ప్రతీ ఏటా 11 శాతం పెట్టుబడిని పెంచుకుంటూ పోవాలి. ఇలా పెంచుకుంటూ పోతే మీరు డబ్బులు ఎక్కువ పొదుపు చేసుకోగలుగుతారు. ఇక 12వ నెంబర్ సీక్రెట్ విషయానికొస్తే.. మీరు పొదుపు చేసే డబ్బులను ప్రతీ ఏడాది కనీసం 12 శాతం రిటర్న్స్ వచ్చే ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలి. ఇక మూడో అంకె 20 నెంబర్ సీక్రెట్ ఏంటి అంటే.. కనీసం 20 ఏళ్ల పాటు మీరు నిలకడగా పెట్టుబడి పెట్టాలి. దీని వల్ల ఈ ఫార్ములాకు 11-12-20 అనే పేరు వచ్చింది.
రూ.కోటికి ఎలా చేరాలి..?
ఉదాహరణకు మీరు రూ.కోటి సంపాదించాలని అనుకుందామనుకున్నారు. ప్రతీ నెలా రూ.11 వేల చొప్పున 20 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. 20 ఏళ్లల్లో మీ పెట్టుబడి రూ.26.24 లక్షలకు చేరుకుంటుంది. పెట్టుబడిపై చక్రవడ్డీ రూపంలో రూ.83.50 లక్షల సంపద వస్తుంది. దీంతో మీరు రూ.కోటి వరకు సంపాదించొచ్చు.




