Investment Ideas: డబ్బులు దాచుకోవాలనుకునేవారికి గోల్డెన్ ఛాన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బులే.. డబ్బులు..
రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోవాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వ అద్బుతమైన పథకం అందుబాటులో ఉంది. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS). ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి..? నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి..? ఇందులో పెడితే లాభమా..? నష్టమా..? అనే వివరాలు తెలుసుకుందాం.

NPS Account: డబ్బులు పొదుపు చేయాలనుకునేవారికి ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. రిస్క్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకునేవారికి స్టాక్ మార్కెట్ అనేది ఒక ఆప్షన్. బాగా రీసెర్చ్ చేసి మంచి కంపెనీలో లాంగ్ టర్న్ ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో వచ్చినంత భారీ రాబడి ఎక్కడా రాదు. కానీ స్టాక్ మార్కెట్ అనేది ఒడిదొడుకుల మధ్య సాగుతూ ఉంటుంది. దీంతో ఇది అత్యంత ప్రమాదకరకమైన పెట్టుబడి అవకాశంగా చెప్పవచ్చు. ఇక బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పోస్టల్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఎన్నో ఆప్షన్లు డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రిస్క్ అనేది అసలు ఉండదు.
ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పెట్టుబడి స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది. అందులో అందరికీ తెలిసినది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). రిటైర్మెంట్ అయ్యాక ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా భవిష్యత్ అవసరాల కోసం డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి పథకమని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కీమ్ కావడంతో మీ డబ్బులకు రక్షణ కూడా ఉంటుంది. దీంతో పాటు పన్ను మినహాయింపులు, అధిక వడ్డీ, మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల భారత పౌరులు అందరూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
టైర్ 1 అకౌంట్
ఎన్‌పీఎస్‌లో మొత్తం రెండు అకౌంట్లు ఉంటాయి. టైర్ 1 అనేది రిటైర్మెంట్ కోసం పర్మినెంట్ పెట్టుబడి అకౌంట్. ఈ అకౌంట్ ద్వారా డబ్బులు పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ అయ్యేవరకు తీసుకోలేము. ఇందులో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. దాదాపు రూ.1.5 లక్షల దాకా ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఇక అదనంగా మరో రూ.50 వేల ట్యాక్స్ బెనిఫిట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ తీసుకున్నవారిక 60 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది.
టైర్ 2 అకౌంట్
ఈ అకౌంట్ అనేది వాలంటరీ సేవింగ్స్ అకౌంట్. ఇందులో ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉండదు. అయితే మీ డబ్బులు మీరు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే టైర్ 2 అకౌంట్ తీసుకోవాలంటే టైర్ 1 ఖాతా కలిగి ఉండాలి. అప్పుడు రెండు అకౌంట్లు పర్మనెంట్ రిటైర్మంట్ అకౌంట్ నెంబర్‌కు లింక్ అవుతాయి.
అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి..?
ఆన్‌లైన్‌లో eNPS పోర్టల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా బ్యాంకుల ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్‌ల ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌లో కూడా అకౌంట్ తెరిచే అవకాశం ఉంది. ఈ అకౌంట్‌లో మీరు కనీసం నెలకు రూ.500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.




