Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చెక్ చేసుకోండి..

మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే.. ముందుగా మీరు మీ క్రెడిట్ స్కోర్ బెటర్‌గా ఉంచుకోండి. తద్వారా వెంటనే రుణం పొందవచ్చు. దేశంలో అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చెక్ చేసుకోండి..
Personal Loan
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 07, 2022 | 10:00 AM

తక్షణ డబ్బు అవసరమైన వారికి పర్సనల్ లోన్ సహాయపడుతుంది. వ్యక్తిగత రుణం అనేది ఒక రకమైన అసురక్షిత రుణం.. మీరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి తీసుకోవచ్చు ఇలాంటి లోన్ తీసుకోవచ్చు. దాని సహాయంతో మీరు మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. మీరు పండుగ సీజన్‌లో స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకొని మీ వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే. ఇప్పుడు అతని డబ్బును తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది.. అటువంటి పరిస్థితిలో మీరు వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ వార్తలో చౌకైన వ్యక్తిగత రుణం గురించి మరింత సమాచారాన్ని అందించబోతున్నాము.

పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే..

పర్సనల్ లోన్‌ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటే ముందుగా క్రెడిట్ స్కోర్‌ను బాగా ఉంచుకోవడం మంచిది. మీ క్రెడిట్ స్కోర్ లోన్ తీసుకోవడంలో సహాయపడుతుంది. దీని సహాయంతో మీరు వెంటనే లోన్ పొందవచ్చు. దేశంలో అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తికి త్వరగా పర్సనల్ లోన్ లభిస్తుంది. అలాగే, మీపై ఉండే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు సకాలంలో వ్యక్తిగత రుణం తీసుకుని ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఎంత అవసరం అవుతుంది. మీరు మీ టార్గెట్ నిర్ణయించుకోవాలి. మీకు ఎంత ఫండ్ కావాలి..? మీ నెలవారీ ఆదాయం ఆధారంగా మీరు ఎంత సమయంలో లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించగలరో ఓ అంచనా వేసుకోవాలి. పర్సనల్ లోన్ మొత్తం వడ్డీ రేటు, లోన్ మొత్తం ఆధారంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ బ్యాంక్ అతి తక్కువ వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది..

మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే.. మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణం కోసం ఆర్థిక సంస్థ లేదా బ్యాంకులను సంప్రదించవచ్చు. అయితే రుణం తీసుకునే ముందు రుణ ఆఫర్లు, వడ్డీ రేటు, బ్యాంకుల EMI వంటి అన్ని అంశాలను పరిశీలించాలి. ఇలా చెక్ చేసకున్న తర్వాతే లోన్ తీసుకోవాలి.  రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను 3 సంవత్సరాల కాలవ్యవధిలో ప్లాన్ చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఏది నిర్ణయించుకోవచ్చో తెలుసుకోండి.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ న్యూస్ కోసం