AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?.. పూర్తి వివరాలు మీ కోసం

గోల్డ్ లోన్ సురక్షితమైన రుణంగా చెప్పవచ్చు. కానీ ఒక కస్టమర్ గోల్డ్ లోన్ మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోతే.. అతను పెద్ద సమస్యలను ఎదుర్కోవచ్చు.

Gold Loan: గోల్డ్ లోన్ తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?.. పూర్తి వివరాలు మీ కోసం
Gold Loan
Sanjay Kasula
|

Updated on: Nov 07, 2022 | 9:21 AM

Share

గోల్డ్ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్. బంగారం, ఆభరణాలు లేదా ఏదైనా బంగారు వస్తువును తనఖా ఉంచడం ద్వారా మీరు ఎక్కడ రుణం తీసుకోవచ్చు. పర్సనల్ లోన్‌తో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో మరింత అనుకూలంగా చెప్పవచ్చు. మీరు సంవత్సరానికి 11-12 శాతం వడ్డీ రేటుతో బంగారు రుణం తీసుకోవచ్చు. వ్యక్తిగత రుణాలను 14-22 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటారు. బంగారు రుణంలో రైతులకు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రైతులు దీనిని 8 శాతం వడ్డీ రేటుతో పొందుతారు. విశేషమేమిటంటే, మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ.. మీరు సులభంగా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ కోసం మీరు మీ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాల్సిన అవసరం లేదు. అయితే గోల్డ్ లోన్ కట్టలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా.. మీరు గోల్డ్ లోన్ తిరిగి చెల్లించలేకపోతే ఏం జరుగుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం..

అపరాధ రుసుము

కస్టమర్ తన నిర్ణీత గడువులోగా లోన్‌ను ఆలస్యంగా చెల్లిస్తే.. బకాయి ఉన్న మొత్తంపై వడ్డీ రేటు అంత ఎక్కువగా వసూలు చేయబడుతుంది.

రిమైండర్ లెటర్, సందేశం, కాల్..

మీరు గోల్డ్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే లేదా గడువు ముగిసినట్లయితే.. రుణదాత మీకు రిమైండర్ లెటర్, మెసేజ్ లేదా కాల్ చేయడం ద్వారా దాని గురించి మిమ్మల్ని హెచ్చరించవచ్చు. కంపెనీ రిమైండర్ చేసిన తర్వాత.. కస్టమర్ వెంటనే వెళ్లి కంపెనీ బ్రాంచ్‌కు వెళ్లి కలవడం ద్వారా లోన్ బకాయి మొత్తాన్ని చెల్లించవచ్చు.

వేలం..

ఇచ్చిన గడువులోపు బంగారు రుణాన్ని తిరిగి చెల్లించనట్లయితే.. రుణం ఇచ్చే కంపెనీకి బంగారాన్ని బహిరంగ వేలం వేస్తున్నట్లుగా ప్రకటిస్తుంది. వేలం వేసే అధికారం రుణం ఇచ్చిన కంపెనీకి ఉంటుంది. అయితే, బంగారం వేలానికి రెండు వారాల ముందు కంపెనీ కస్టమర్‌కు తెలియజేయడం తప్పనిసరి. కంపెనీ వేలం వేసిన బంగారం ధర రుణం కంటే ఎక్కువగా ఉంటే.. కంపెనీ 30 రోజుల్లోగా మిగిలిన మొత్తాన్ని కస్టమర్‌కు తిరిగి ఇస్తుంది. వేలం తర్వాత రుణం కంటే తక్కువ మొత్తం ఉంటే.. కంపెనీ చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. రుణాన్ని తిరిగి పొందేందుకు. దీనిపై వారికి హక్కు ఉంది.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ న్యూస్ కోసం