Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత..? తెలియకపోతే ఇప్పుడు వాట్సప్‌లో ఇలా సులభంగా చెక్ చేసుకోండి..

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా లోన్ తీసుకోవాలన్నా , తక్కువ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్ పొందాలన్నా క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యమనే విషయం ప్రత్యేకంగా..

Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత..? తెలియకపోతే ఇప్పుడు వాట్సప్‌లో ఇలా సులభంగా చెక్ చేసుకోండి..
Credit Score On Whatsapp
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 13, 2023 | 10:03 AM

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా లోన్ తీసుకోవాలన్నా , తక్కువ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్ పొందాలన్నా క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే పర్సనల్ లోన్‌కి ఉన్న వడ్డీ రేట్లలో డిస్కౌంట్ లభిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవటం చాలా అవసరం. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

అయితే ఇపుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేయటానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వాట్సాప్ యాప్ ద్వారా కూడా మీ సిబిల్ స్కోర్‌ను కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డేటా అనలిటిక్స్ అండ్ డెసిషన్ ఆర్గనైజేషన్ ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్‌‌లోనే ఫ్రీగా క్రెడిట్ స్కోర్‌ రిపోర్ట్స్‌ను ఆఫర్ చేయడం మొదలు పెట్టింది. దీంతో క్రెడిట్ స్కోర్ రిపోర్టు పొందాలనుకునే వారు సులభంగా దీని ద్వారా క్రెడిట్ స్కోర్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్ ఇండియా కంపెనీ వాట్సాప్ నుండి ప్రతి ఒక్కరికీ ఈ సదుపాయాన్ని అందిస్తుంది. దీని వల్ల ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. వాట్సాప్‌ ద్వారా సిబిల్‌ తనిఖీ చేయడం వల్ల ఎలాంటి మోసం ఉండదు. ఒక వేళ ఈ క్రమంలో ఎలాంటి మోసం జరిగినా పసిగట్టవచ్చు.

వాట్సప్ ద్వారా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవటానికి ఈ విధంగా చేయండి..

ఇవి కూడా చదవండి
  1. మొదటగా ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్ నంబర్ +91-9920035444 ని మీ ఫోన్‌లో సేవ్ చేసి ఉంచండి.
  2. ఆ తర్వాత వాట్సాప్‌లో ఆ నంబర్‌కి ‘Hi’ అని మెసేజ్ పంపి మీ పేరు, రిజిస్టర్డ్‌ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలని తెలియచేయాలి.
  3. ఇలా రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పాస్‌వర్డ్-ప్రొటెక్షన్‌తో ఎక్స్‌పీరియన్ క్రెడిట్ రిపోర్ట్ రిక్వెస్ట్ చెయ్యాలి. అతి తక్కువ సమయంలో చాలా సులభంగా సురక్షితంగా మీరు క్రెడిట్ రిపోర్ట్ వాట్సాప్‌లో పొందొచ్చు.  మీరు ఈ క్రెడిట్ రీపోర్టును పాస్‌వర్డ్ సెక్యూర్డ్ కాపీని కూడా అభ్యర్థించవచ్చు. మీరు ఈ కాపీని మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి ద్వారా పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి