Smart Investing: నష్టాల నుంచి లాభాలా బాట పట్టాలనుకుంటున్నారా..? జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు..
అయితే 2022లో పెట్టుబడి దారులకు కాస్త నిరాశను కల్గించాయంటున్నారు నిపుణులు. అయితే ఈ ఎదురుదెబ్బ మంచిదే అంటున్నారు. దీని నుంచి మంచి పాఠాలు నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. తద్వారా 2023లో మరింత పకడ్బందీగా పెట్టుబడి పెట్టుకొని లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు.
జీవితంలో అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుండాలి! ఎందుకంటే అవి నేర్పించే పాఠం మరెవ్వరూ నేర్పలేరు. ఏదో ఓ రకంగా గెలిచేస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు. పైగా ఆత్మవిశ్వాసం కాస్త గర్వంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఓసారి ఓడిపోతే గానీ మనల్ని మనం అర్థం చేసుకోడానికి, దానికి నుంచి విజయం వైపు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. 2020, 2021లు పెట్టుబడి దారులకు కాసుల వర్షం కురిపించాయి. బంగారం, ఈక్విటీస్, బాండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ ఇలా ఇక్కడ పెట్టుబడులు పెట్టినా లాభాలనే తీసుకొచ్చాయి. ఇది పెట్టుబడి దారుల్లో సంతృప్తితో పాటు మితీమిరిన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా పెట్టుబడి పెట్టే విధానంలో తేడాలు,పొరపాట్లు చేసే అవకాశం ఏర్పడింది.
కలిసిరాని 2022..
అయితే 2022లో పెట్టుబడి దారులకు కాస్త నిరాశను కల్గించాయంటున్నారు నిపుణులు. అయితే ఈ ఎదురుదెబ్బ మంచిదే అంటున్నారు. దీని నుంచి మంచి పాఠాలు నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. తద్వారా 2023లో మరింత పకడ్బందీగా పెట్టుబడి పెట్టుకొని లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. మరి 2022 మనకు నేర్పిన ఆర్థిక పాఠాలు ఏంటి? నష్టాల నుంచి బయటపడేందుకు నిపుణులు చెబుతున్న సూచనలు ఏంటి? ఓ సారి చూద్దాం..
కలల్లో బతక కూడదు.. వాటిని నిజం చేసుకోవాలి..
20 ఏళ్లకే సంపాదన మొదలు పెట్టేయ్యాలి.. 30 ఏళ్ల ఆర్థిక స్వేచ్ఛ వచ్చేయాలి.. 35 ఏళ్లకే రిటైర్మెంట్ ఇచ్చేసి హ్యాపీగా బతికేయాలి.. అంతా ఫాస్ట్ గా అయిపోవాలి.. అని చాలా మంది కలలు కంటారు. మనం పెట్టుబడి పెట్టగానే లక్షలు, కోట్లు వచ్చేయాలని అనుకుంటారు. అది అందరికీ సాధ్యం కాదు. నూటికో కోటికో ఒక్కరిద్దరికీ ఆ తరహా రాబడులు సాధ్యం కావచ్చు. మనం కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏదైనా స్టెప్ బై స్టెప్ సాధించాలని సూచిస్తున్నారు నిపుణులు..
- మొదట మీ సామర్థ్యాన్ని 100 శాతం వినియోగించి మంచి సంపాదనను ఆర్జించాలి. ఆ తర్వాత మీకొస్తున్న నెలవారీ సంపాదనలో నుంచి 40 నుంచి 50 శాతం సేవింగ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
- అలా సేవ్ చేసిన మొత్తాన్ని ఏదైనా పెట్టుబడి పథకాల్లో ఇన్ వెస్ట్ చేయాలి. అవకాశం ఉన్నంత వరకూ రిస్క్ తక్కువగా ఉండే వాటిని చూసుకోవాలి. ఒక వేళ రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో మంచి రాబడులు తెచ్చే పథకాలను ఎన్నుకోవాలి.
- మీరు ఒకవేళ 40 ఏళ్ల వయసులోకి వచ్చేసరికి ఆర్థిక స్వేచ్ఛను ఆశిస్తే.. ఈ స్టెప్స్ ను ఫాలో అవడం ద్వారా కొంత వరకూ దానిని అందుకోవచ్చు.
ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది..
పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పథకాల గురించి కాస్త స్టడీ చేసుకోవాలి. దానిలో ఉన్న రిస్క్ ఎలిమెంట్స్ ఏంటి? దీర్ఘకాలంలో మనకు వచ్చే రాబడులు ఏవిధంగా ఉంటాయి? వంటి వాటిని బేరీజు వేసుకోవాలి. ఉదాహరణ చూస్తే 2021లో క్రిప్టో కరెన్సీకి ఫుల్ బూమ్ ఏర్పడింది. అందరూ విరివిగా దానిపై పెట్టుబడులు పెట్టారు. అయితే అదే క్రిప్టో కరెన్సీ 2022లో డౌన్ ఫాల్ అయ్యింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందే అన్నీ విషయాలపై అవగాహన పెంచుకోవాలి..
షార్ట్ కట్స్ వద్దు..
మీ బిజినెస్ ను అంచనా వేసుకునేందుకు షార్ట్ కట్స్ పై ఆధారపడకూడదు. షార్ట్ టైంలో అధిక రాబడులు వచ్చేయాలని ఆశించకూడదు. అలా జరిగితే దీర్ఘకాలంలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉటుంది. అందుకే అవకాశం ఉన్నంత వరకూ మీ పెట్టుబడులు మంచి రాబడులుగా మారేందుకు అవసరమైన సమయాన్ని పెట్టుకోవాలి. ముందు మార్కెట్ ను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టాలి. అనంతరం రాబడులు కోసం వేచి ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..