AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: క్యాష్‌లెస్‌ క్లయిమ్‌లకు డిమాండ్.. పాలసీ ఏదైనా కావాల్సిందిదే.. ఎందుకంటే

ఎక్కువశాతం మంది ఆరోగ్య బీమాలను తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆరోగ్య లేదా వైద్య బీమా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పాలసీదారు, బీమా కంపెనీ మధ్య ఒప్పందం కారణంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి సాయపడుతుంది. దీనిలోనూ క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అందరూ ఆసక్తి చూపుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.

Health Insurance: క్యాష్‌లెస్‌ క్లయిమ్‌లకు డిమాండ్.. పాలసీ ఏదైనా కావాల్సిందిదే.. ఎందుకంటే
Health Insurance
Madhu
|

Updated on: Jun 28, 2024 | 6:34 PM

Share

మనిషి వైద్యం కోసం ఎంతైనా ఖర్చుపెడతాడు. ప్రాణం కన్నా విలువైనది ఏది లేదని భావిస్తాడు. ప్రస్తుత సమాజంలో వైద్యం చాలా ఖరీదైనిగా మారిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం ఆస్పత్రుల్లో అన్ని రోగాలకు సరైన చికిత్సా విధానలు, పరికరాలు అందుబాటులో ఉండని నేపథ్యంలో ఇక ప్రైవేటు వైద్యం అనేది అనివార్యంగా మారిపోయింది. ఈ క్రమంలో అందరూ హెల్త్‌ ఇన్సురెన్స్‌ల బాట పడుతున్నారు. ముఖ్యంగా కరోనా అనంతరం మనిషి ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ఫలితంగా ఎక్కువశాతం మంది ఆరోగ్య బీమాలను తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆరోగ్య లేదా వైద్య బీమా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పాలసీదారు, బీమా కంపెనీ మధ్య ఒప్పందం కారణంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి సాయపడుతుంది. దీనిలోనూ క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అందరూ ఆసక్తి చూపుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఆ క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ క్లయిమ్‌ రిజక్ట్‌ అవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

రెండు రకాల క్లయిమ్‌ విధానాలు..

ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పుడు ఆరోగ్య బీమాలో పూర్తిగా నగదు రహిత చికిత్స సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్ని పరిస్థితుల్లో రీయింబర్స్‌మెంట్ విధానం అమలులో ఉంటుంది. అయితే రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేసే విధానం పాలసీదారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆసుపత్రులలో ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందడానికి కస్టమర్లు తమ సొంత జేబుల నుంచి డబ్బు చెల్లించాలి లేదా లోన్ తీసుకోవాలి. ఒక సర్వే ప్రకారం, 68 శాతం మంది ప్రజలు పాలసీలో నగదు రహిత క్లెయిమ్‌ల సౌకర్యం లేకుంటే, వారికి ఆర్థిక సహాయం అవసరం లేదా వారి పొదుపును ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధానం పట్ల పాలసీదారులకు అసంతృప్తి ఉందని సర్వే సూచించింది. చిన్న పట్టణాల్లో చికిత్స ఖర్చు రూ.లక్ష దాటితే రుణం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అందువల్ల, నగదు రహిత చికిత్స పాలసీదారుల మొదటి ఎంపికగా మారింది. అయితే చాలా మంది నగదు రహిత చికిత్స సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. అయినప్పటికీ ఈ సర్వేలో 89 శాతం మంది ప్రజలు నగదు రహిత క్లెయిమ్‌లతో చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

సర్వే ఇలా..

ఆరోగ్య బీమా పాలసీలు, వాటి ప్రక్రియలకు సంబంధించి ప్రజలలో సంతృప్తి స్థాయిని తెలుసుకోవడానికి ఓ సంస్థ సర్వేను నిర్వహించింది. దీనిలో నగదు రహిత క్లెయిమ్‌లకు తక్కువ సమయం పడుతుంది. అది పాలసీదారులలో ఎక్కువ సంతృప్తిని అందిస్తుంది. అందుకే ఎక్కువ శాతం మంది నగదు రహిత క్లయిమ్‌లను ఇష్టపడుతున్నారని చెబుతున్నారు.

నగదు రహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్లో ప్రయోజనాలు..

  • మీరు ఏదైనా నెట్‌వర్క్ ఆసుపత్రులలో చేరవచ్చు కాబట్టి తక్షణ చికిత్స, బీమా ప్రతినిధికి తక్షణమే సమాచారం అందించడం మాత్రమే అవసరం. ప్రక్రియ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
  • నగదు రహిత క్లెయిమ్ విషయంలో అవసరమైన డాక్యుమెంటేషన్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లలోని అవసరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.
  • ఇది పన్ను బాధ్యత పరంగా ఒక ప్రధాన ప్రయోజనం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద, ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియం మినహాయించబడుతుంది.
  • ఇది రోగ నిర్ధారణ, చికిత్స, డాక్టర్ చార్జీలు మొదలైనవాటిని, ప్రీ, పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌ ఖర్చులు రెండింటినీ కవర్ చేస్తుంది.
  • డయాలసిస్, కీమోథెరపీ, సర్జరీ ఖర్చులు, అడ్మిషన్ ఖర్చు, ఇతర డేకేర్ ఖర్చులు వంటి ప్రత్యేక చికిత్సలు కూడా కవర్ అవుతాయి.
  • మీరు కష్టపడి సంపాదించిన డబ్బును హాస్పిటల్ బిల్లుల కోసం ఉపయోగించాల్సిన అవసరం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..