Paytm: 2 రోజుల్లోనే రూ. 50వేల కోట్లకు పైగా సంపద ఆవిరి!.. ఎందుకు ఇలా జరిగింది..

పేటీఎం లిస్ట్ అయిన తర్వాత రెండో సెషన్‎లో కూడా నష్టాల బాటలోనే ప్రయాణించింది. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు మదుపర్లకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన తొలి రోజే భారీగా పతనమైన షేరు విలువ మరింత దిగజారుతోంది...

Paytm: 2 రోజుల్లోనే రూ. 50వేల కోట్లకు పైగా సంపద ఆవిరి!.. ఎందుకు ఇలా జరిగింది..
Paytm
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 23, 2021 | 6:53 AM

పేటీఎం లిస్ట్ అయిన తర్వాత రెండో సెషన్‎లో కూడా నష్టాల బాటలోనే ప్రయాణించింది. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు మదుపర్లకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన తొలి రోజే భారీగా పతనమైన షేరు విలువ మరింత దిగజారుతోంది. సోమవారం ట్రేడింగ్‌లో ఓ దశలో ఏకంగా 14 శాతం తగ్గి పెట్టుబడిదారులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.2,150 కంటే దాదాపు 41 శాతం నష్టపోయి రూ.1,271 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇష్యూ ధర వద్ద కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.39 లక్షల కోట్లు కాగా.. దాంట్లో దాదాపు రూ.56 వేల కోట్ల సంపద ఆవిరైంది.

36 శాతం పెట్టుబడి ఆవిరితో మదుపరులు లబోతిబోమంటున్నారు. పేటీఎం పబ్లిక్‌ ఇష్యూలో ఒక లాట్‌కు 6 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.2,150 ప్రకారం ఒక లాట్‌కు పెట్టుబడి రూ.12,900 అయింది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఉన్న రూ.1,366తో పోలిస్తే.. పెట్టుబడి విలువ రూ.8,196కి తగ్గింది. ఈ ప్రకారం చూస్తే.. పెట్టుబడిదారుడికి రూ.4,704 నష్టం వచ్చింది. అంటే 36 శాతం పెట్టుబడి ఆవిరైంది. ఐపీఓలో షేరు ధర అధికంగా నిర్ణయించడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ డౌన్‌.. ఇక సౌదీ ఆరామ్‌కోతో 15 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చొన్న రిలయన్స్‌.. దాన్ని పునఃమదింపు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, దాదాపు ఈ డీల్‌ రద్దయినట్లేనని మార్కెట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో రిలయన్స్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో ఓ దశలో 4.5 శాతానికి పైగా పడిపోయింది.

పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల వ్యాపార విలువ (జీఎంవీ) రెట్టింపై రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో జీఎంవీ రూ. 94,700 కోట్లు. నిర్దిష్ట కాల వ్యవధిలో తమ యాప్, పేమెంట్‌ సాధనాలు మొదలైన వాటి ద్వారా వ్యాపారస్తులకు మొత్తం చెల్లింపు లావాదేవీలను పేటీఎం జీఎంవీగా పేర్కొంటారు.

వినియోగదారుల మధ్య జరిగే నగదు బదిలీ వంటి పేమెంట్‌ సర్వీసులను పరిగణనలోకి తీసుకోంది. కంపెనీ గణాంకాలను బట్టి జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో నెలవారీగా లావాదేవీలు జరిపే యూజర్ల సంఖ్య 33 శాతం పెరిగి 4.3 కోట్ల నుంచి 5.7 కోట్లకు పెరిగింది. ఇక పేటీఎం ద్వారా మంజూరు చేసిన రుణాల విలువ 500 శాతం ఎగిసి రూ. 210 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు పెరిగింది.

Read Also… Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత ఉందంటే..