AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crude Oil: 2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరుగా ఉండనుందా.. అయితే ధర మరింత పెరుగుతుందా..

ఇప్పడు మనకు ప్రధాన ఇంధనం చమురు. ఇదీ లేకుంటే దాదాపు అన్ని పనులు ఆగిపోతాయి. దీనికి ప్రత్యామ్నయాలు వస్తున్నా..

Crude Oil: 2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరుగా ఉండనుందా.. అయితే ధర మరింత పెరుగుతుందా..
Opec
Srinivas Chekkilla
|

Updated on: Sep 30, 2021 | 9:49 AM

Share

ఇప్పడు మనకు ప్రధాన ఇంధనం చమురు. ఇదీ లేకుంటే దాదాపు అన్ని పనులు ఆగిపోతాయి. దీనికి ప్రత్యామ్నయాలు వస్తున్నా.. సక్సెస్ కావడం లేదు దీంతో మరిన్ని దశాబ్దాల పాటు చమురే ప్రధాన ఇంధన వనరుగా ఉంటుందని చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ అంచనా వేసింది. చమురుతో కాలుష్యం పెరిగిపోతోందని, ప్రత్యామ్నాయ-పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వివిధ దేశాలు దృష్టి సారిస్తున్న తరుణంలో ఒపెక్‌ ఇలా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో గ్లాస్గోలో వాతావారణంపై జరిగే శిఖరాగ్ర సమావేశం (క్లైమేట్‌ సమ్మిట్‌)లో ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులపై చర్చించే అవకాశం ఉంది. ధనిక దేశాల్లో మాత్రం రహదారులపైకి విద్యుత్‌ వాహనాలు ఎక్కువగా రావడం వల్ల ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధన వనరుల ఆవిష్కరణ కోసం ఒత్తిడి పెరుగుతుండగా, చమురుకు గిరాకీ తగ్గుతోందని వివరించింది.

మిగతా దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని విస్తరించేందుకు ఇంకా చమురే ప్రధాన వనరుగా ఉందని, 2045 వరకు ఇది కొనసాగుతుందని తమ ‘వార్షిక ప్రపంచ చమురు భవిష్యత్‌ అంచనా’ నివేదికలో ఒపెక్‌ తెలిపింది.2020లో కొవిడ్‌ ప్రభావంతో చమురుకు గిరాకీ బాగా తగ్గినా, ఈ ఏడాది మళ్లీ పుంజుకుంటోందని, దీర్ఘకాలం ఇది కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా ప్రాథమిక ఇంధన గిరాకీ 2020-45 మధ్య కాలంలో 28 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది.

ఒపెక్ నివేదిక ప్రస్తావించిన ప్రధాన అంశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2045 నాటికి రెండింతలు అయ్యే అవకాశం ఉందని, జనాభా కూడా మరో 170 కోట్లు పెరగొచ్చని నివేదిక వివరించింది.

ప్రపంచంలో 2045 నాటికి మొత్తం వాహనాలు 110 కోట్ల నుంచి 260 కోట్లకు చేరతాయని, ఇందులో 50 కోట్లు విద్యుత్‌ వాహనాలు (మొత్తం వాహనాల్లో 20 శాతం) ఉండొచ్చని తెలిపింది.

చైనా, భారత్‌ వంటి దేశాల్లో పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో 2020-45 మధ్య కాలంలో చమురుకు గిరాకీ బాగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

2045 నాటికి ప్రపంచ ఇంధన గిరాకీలో 28.1 శాతం వాటా చమురుకే ఉండొచ్చని, ఇప్పటితో పోలిస్తే మాత్రం 30 శాతం మేర తగ్గొచ్చని తెలిపింది.

సహజ వాయువు 24.4 శాతం, బొగ్గు 17.4 శాతం మేర వాటా కలిగి ఉండొచ్చని, మిగతా వనరులుగా అణు (న్యూక్లియర్‌), జల విద్యుత్‌, బయోమాస్‌ ఇంధనం, గాలి, సౌర వంటి పునరుత్పాదక ఇంధనాలు కొనసాగొచ్చని పేర్కొంది.

Read Also.. LIC and India Post: ఎల్ఐసీ బాండ్ వేగంగా పాలసీ హోల్డర్లకు చేర్చడానికి భారత పోస్టాఫీస్‌తో జతకలిసిన ఎల్ఐసీ