Online Transactions: ఒకవేళ బ్యాంకులు కనుక ఆ తప్పు చేస్తే.. మీకు పెనాల్టీ చెల్లించాలి..ఆన్లైన్ పేమెంట్స్ చేసేవారు తప్పక తెలుసుకోండి!
మీరు మొబైల్ ఫోన్ యాప్ ద్వారా మీకు తెలిసిన వారికి డబ్బులు పంపించడానికి ప్రయత్నించారు. ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. కానీ, మీ ఎకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయి.
Online Transactions: మీరు మొబైల్ ఫోన్ యాప్ ద్వారా మీకు తెలిసిన వారికి డబ్బులు పంపించడానికి ప్రయత్నించారు. ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. కానీ, మీ ఎకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయి. తరువాత ఎప్పుడో నాలుగు రోజులకు గానీ ఆ డబ్బులు మీకు తిరిగి క్రెడిట్ కాలేదు. ఏం చేస్తారు? పోనీలే నాలుగు రోజులకైనా డబ్బులు వచ్చేశాయిగా అని సంతోషిస్తారు. అంతేనా?
కానీ, అలా డబ్బులు కట్ అయ్యి తిరిగి వెంటనే క్రెడిగ్ కాకపొతే మీ బ్యాంక్ మీకు పెనాల్టీ చెల్లించాలి. ఈ విషయం మీకు తెలుసా? మీకే కాదు చాలా మందికి తెలీదు. నిజానికి బ్యాంకులతో చేసే ఏ ట్రాన్సాక్షన్ కి అయినా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి అయ్యేలా సిస్టం ఉంటుంది. దానిని అతిక్రమిస్తే పెనాల్టీ పడుతుంది.
ఇప్పుడు దాదాపుగా అందరూ ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అది చెక్ డిపాజిట్ కావచ్చు.. యూపీఐ ద్వారా కావచ్చు.. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావచ్చు.. డెబిట్ కార్డు ద్వానా ఏటీఎం నుంచి కావచ్చు సొమ్ములను ఎవరికైనా పంపించే విధానాలు అనుసరిస్తున్నారు. వీటిలో తలెత్తే సమస్యలకు ఆయా బ్యాంకులు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. లేకపోతె పెనాల్టీ తో సహా కస్టమర్ కి ఇవ్వాల్సి వస్తుంది.
ముందే చెప్పినట్టు ఈ విషయం చాలా మందికి తెలీదు. తాజాగా మొన్న ఏప్రిల్ 1 వ తేదీన ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం కావడంతో కొన్ని బ్యాంకుల యూపీఐ లావాదేవీల్లో సమస్యలు తలెత్తాయి. ఆరోజు కొద్దీ సేపు డబ్బులు పంపిన వారికీ ఇబ్బందులు ఎదురయ్యాయి. తరువాత అంతా మామూలుగా సెట్ అయింది. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
The Financial year end closing had led to some UPI and IMPS transaction failures at few banks. We have observed that most of these bank systems are back to normal since last evening. Customers may avail uninterrupted IMPS and UPI services.
— NPCI (@NPCI_NPCI) April 2, 2021
ఈ ట్వీట్ పై చాలా మంది స్పందించారు. తమకు చాలాసార్లు అలా జరిగిందని.. డబ్బులు తిరిగి ఇవ్వడంలో బ్యాంకులు సరిగా స్పందించలేదని తమ కామెంట్లలోచెప్పారు. దానికి ఎన్పీసీఐ స్పందించింది. ఎప్పుడన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో ఇబ్బంది వస్తే ఒక్కరోజులో తిరిగి ఖాతాదారు ఎకౌంట్ కు డబ్బు రిటర్న్ చేయాలని అలాకాని పక్షంలో బ్యాంకులు పెనాల్టీ కట్టాల్సి వస్తుందనీ చెప్పింది.
ఆర్బీఐ అక్టోబర్ 2019 లో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులు 24 గంటల్లో ఖాతాదారు సొమ్మును రివర్స్ చేయకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏ ఆన్లైన్ ప్రాసెస్ కి ఎంత టర్న్ ఎరౌండ్ టైం (టీఏటీ) ఉంటుంది? అది దాటితే ఎంత పెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటీఎం ట్రాన్సాక్షన్స్:
ఏటీఎం ద్వారా జరిపిన లావాదేవీల్లో సొమ్ము కట్ అయిన 5 రోజుల్లో తిరిగి ఖాతాదారు ఎకౌంట్ కి ట్రాన్సఫర్ కావాలి. లేకపోతె 5 రోజుల తరువాత నుంచి ఆలస్యం అయిన ప్రతి ఒక్కరోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంకులు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
కార్డు టు కార్డు ట్రాన్స్ఫర్:
పంపించిన వారి కార్డు ఎకౌంట్ నుంచి సొమ్ము కట్ అయి బెనిఫిషరీ (ఎవరికీ సొమ్ము చేరాలో వారు) ఎకౌంట్ కి సొమ్ము చేరకపోతే ఒక్కరోజు లోపు తిరిగి పంపించిన వారి ఎకౌంట్ కి రివర్స్ అవ్వాలి. అలా కాకపొతే ఒక్కరోజు తరువాత రోజుకు 100 రూపాయల పెనాల్టీ బ్యాంక్ చెల్లించాల్సి ఉంటుంది.
కొనుగోలు చేసే సమయంలో జరిగిన ట్రాన్సాక్షన్:
- ఏదైనా వస్తువు కొన్నపుడు దానికి ఆ దుకాణదారునికి కార్డు ద్వారా పేమెంట్ చేసినట్టయితే, ఆ పేమెంట్ దుకాణ దారుని ఎకౌంట్ కి వెళ్లకుండా ఫెయిల్ అయి వినియోగదారుని సొమ్ము కట్ అయితే కనుక.. 5 రోజుల లోపు సొమ్ము వినియోగదారునికి రివర్స్ కావాలి. ఒకవేళ అలా వెనక్కు వెళ్లకపోతే బ్యాంకులు రెండో రోజు నుంచి రోజుకు 100 రూపాయల పెనాల్టీ చెల్లిచాల్సి వస్తుంది.
- ఆన్లైన్ లో కార్డు ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేసినపుడు ఎకౌంట్ నుంచి సొమ్ము డెబిట్ అయ్యి అది అవతల వారికి చేరానపుడు కూడా పై విధంగానే పెనాల్టీని బ్యాంకులు చెల్లించాల్సి వస్తుంది.
ఐఎంపీస్ ట్రాన్సాక్షన్:
ఐఎంపీస్ (ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టం) ద్వారా సొమ్ము పంపినప్పుడు ఆ సొమ్ము అవతలివారికి చేరకుండా పంపిన వారి ఎకౌంట్ నుంచి డెబిట్ అయితే ఒక్కరోజు లోపు ఆ సొమ్ము రివర్స్ కావాలి. అలా కానట్లయితే, రోజుకు 100 రూపాయలు పెనాల్టీ బ్యాంకులు చెల్లించాల్సి వస్తుంది.
యూపీఐ ట్రాన్సాక్షన్:
- యూపీఐ ద్వారా సొమ్ములు పంపినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి మన ఎకౌంట్ లో డబ్బులు కట్ అయితే, ఆ డబ్బు ఒక్కరోజులో రివర్సల్ కావాలి. లేకుంటే రెండోరోజు నుంచి రోజుకు 100 రూపాయల పెనాల్టీ బ్యాంకు కట్టాల్సి వస్తుంది.
- అదేవిధంగా యూపీఐ ద్వారా ఏదైనా వస్తువు కొన్నపుడు ఇలా జరిగినా ఒక్కరోజు తరువాత నుంచి రోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంకులు చెల్లించాల్సిందే.
ఆధార్ ద్వారా చెల్లింపులు:
ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేస్తున్నారు. ఆధార్ కార్డు ద్వారా జరిపిన ఏ లావాదేవీలో అయినా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినపుడు సొమ్మును సంబంధిత ఖాతాదారునికి 5 రోజుల్లోపు రివర్స్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఐదో రోజు తరువాత నుంచి రోజుకు 100 రూపాయలు పెనాల్టీని బ్యాంకులు చెల్లించాల్సి వస్తుంది.
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) ద్వారా:
నాచ్ ద్వారా పేమెంట్ చేసినపుడు ఫెయిల్ అయినా ఒక్కరోజు లోపు ఏమాంట్ రివర్స్ అవ్వాలి. అలా కాకుంటే రోజుకు వందరూపాయలు పెనాల్టీని బ్యాంకులు భరించాల్సి వస్తుంది.
ఈ నిబంధనలు భారతదేశంలో జరిగే ట్రాన్సాక్షన్స్ కు మాత్రమే వర్తిస్తాయి. సొమ్ములు పంపిన వారు.. సొమ్ము చేరాల్సిన వారు ఇద్దరూ భారతదేశంలో నివసిస్తూంటేనే ఈ పెనాల్టీలు వర్తిస్తాయి.
సో,ఇకపై ఎప్పుడన్నా మీరు డబ్బులు పంపిన ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే, సొమ్ము రివర్స్ అవడం లేటయితే, సంబంధిత బ్యాంక్ నుంచి పెనాల్టీ కొరవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి.
IRCTC: ఐఆర్‌సీటీసీ అదరిపోయే ఆరు రోజుల టూర్ ప్యాకేజీ.. ఈ అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు