Highest Mileage Bike: ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. అదరిపోయే బైక్‌లు మీకోసం.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Mileage Bikes: అసలే కరోనా సంక్షోభం.. ఆపై పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా...

Highest Mileage Bike: ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. అదరిపోయే బైక్‌లు మీకోసం.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Highest Mileage Bike In Ind
Follow us

|

Updated on: Apr 06, 2021 | 5:38 PM

Mileage Bikes: అసలే కరోనా సంక్షోభం.. ఆపై పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుసగా పెరుగుతున్న చమురు ధరలను చూసి సామాన్య జనాలు హడలిపోతున్నారు. తమ వాహనాలను బయటకు తీయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ. 100కి చేరువగా ఉంది. దాంతో అత్యవసరం అయితేనే తప్ప.. తమ వాహనాలను బయటకు తీయడం లేదు. ఇంకొందరు ప్రజలు బైక్‌లు కొనాలనుకునే వారు మైలేజీ ఇచ్చే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తక్కువ ధరతో పాటు.. ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌‌ల వివరాలను మీకోసం ఇక్కడ వివరిస్తున్నాం. టాప్ మైలేజీ, తక్కువ ధరకు లభించే బైక్‌లేంటో మీరూ చూసేయండి మరి.

టీవీఎస్ స్పోర్ట్.. ఈ బైక్‌లు సరసమైన లభిస్తాయి. టీవీఎస్ కంపెనీ అధికారిక వివరాల ప్రకారం.. ఈ బైక్‌ను ఒక లీటరు పెట్రోల్‌తో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. బీఎస్6 వెర్షన్ అయిన ఈ బైక్ 99.77 సిసి ఇంజన్ కలిగి ఉంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ .35,990 నుండి రూ .63,950 వరకు ఉంటుంది.

బజాజ్ సిటి 110.. మైలేజ్ పరంగా, ధర పరంగా ఈ బైక్ చాలా ఉత్తమ్. ఒక లీటరు పెట్రోల్‌తో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బిఎస్ 6 వెర్షన్ అయిన ఈ బైక్ 115.45 సిసి ఇంజన్ కలిగి ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 32,000- రూ. 53,395 మధ్య ఉంటుంది.

హోండా సిడి 110 డ్రీమ్.. ఈ బైక్‌లో 109.5 సిసి శక్తివంతమైన ఇంజిన్ ఇవ్వబడింది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 6.47, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.3 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ బైక్‌ ముందు భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్, వెనుక భాగంలో 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ పొందుతారు. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. ఈ బైక్‌ ఒక లీటరు పెట్రోల్‌తో 74 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.47,398 – రూ.68,443 వరకు ఉంది.

హీరో పాషన్ ప్రో.. మైలేజ్ పరంగా ఈ బైక్ కూడా ఉత్తమం అని చెప్పొచ్చు. లీటరు పెట్రోల్‌కు 68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్‌ 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. దీనిలో ఎక్స్‌సెన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఇంజిన్ 9.02 Bhp శక్తిని, 9.79 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీని ఇంజిన్.. ఎక్స్‌సెన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .53,425- రూ.72,900 వరకు ఉంది.

Also read:

Tamil Nadu Assembly Election 2021 voting Live: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఆరుబయట అదరగొట్టిన ప్రి వెడ్డింగ్‌ షూట్ వైరల్ అవుతున్న ఫొటోస్ వీడియో..:Pre wedding shoot goes viral video.