తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకూ మంగళవారం పోలింగ్ జరిగింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరిగింది. సమయం ముగిసే సమయానికి క్యూల లైన్‌లో ఉన్నటువంటివాకి కూడా ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించారు ఆయా రాష్ట్రాల ఎస్ఈసీలు.