Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డులో పేరు తప్పుగా పడిందా.. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇలా సవరించండి..?

Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డులో పేరు తప్పుగా పడిందా.. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇలా సవరించండి..?
Voter Id Card

Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డు కేవలం ఓటు వేయడానికే పరిమితం కాదు. ఇది మీ కోసం ఉత్తమ గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. ఆధార్ రాకతో దీని ప్రాధాన్యత కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది

uppula Raju

|

Feb 13, 2022 | 8:06 AM

Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డు కేవలం ఓటు వేయడానికే పరిమితం కాదు. ఇది మీ కోసం ఉత్తమ గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. ఆధార్ రాకతో దీని ప్రాధాన్యత కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది కానీ గుర్తింపు కోసం ఎక్కడైనా సులువుగా వినియోగించుకోవచ్చు. బ్యాంకులో KYC లో అప్‌డేట్‌ చేయడానికి కూడా వాడవచ్చు. అయితే దీనిలో తప్పులుంటే సరిదిద్దేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇంట్లో కూర్చొనే పని పూర్తి చేయవచ్చు. కాబట్టి మీ ఓటరు గుర్తింపు కార్డు గందరగోళంగా ఉంటే మీరు దానిని సులభంగా పరిష్కరించవచ్చు. మీ పేరులో స్పెల్లింగ్ తప్పు పడినా, పదాల తారుమారు ఉన్నా, దానిని ఆన్‌లైన్‌లో సరిదిద్దవచ్చు. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీరు ఈ పనిని స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో కూడా చేయవచ్చు. ఈ సదుపాయం ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే చాలా సమయం పడుతుంది. కానీ ఆన్‌లైన్‌లో పని సులువుగా పూర్తవుతుంది.

1. నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్ లేదా NVSPకి వెళ్లి అక్కడ లాగిన్ అవ్వండి. దీని లింక్ http://www.nvsp.in

2. “ఎలక్టోరల్ రోల్‌లో నమోదుల సవరణ”కి వెళ్లి దానిపై క్లిక్ చేయండి

3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో “ఫారం 8″పై క్లిక్ చేయండి

4. ఇది మిమ్మల్ని అసలు పేజీకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఓటర్ ఐడీ కార్డ్ దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

మీరు నివసించే రాష్ట్రం, అసెంబ్లీ/పార్లమెంటరీ నియోజకవర్గం పేరు, ఓటరు జాబితా పార్ట్ నంబర్, క్రమ సంఖ్య, లింగం, మీ తండ్రి/తల్లి/భర్త వయస్సుతో సహా మీ కుటుంబం గురించిన వివరాలను అందించండి. మీకు ఓటరు ID కార్డ్ ఉంటే మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి. కార్డ్ నంబర్, జారీ చేసిన తేదీ, ఎక్కడ జారీ చేశారు, రాష్ట్రం, నియోజకవర్గం వంటి వివరాలను అందించాలి. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత కొన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. వీటిలో మీ తాజా ఫోటోగ్రాఫ్, చెల్లుబాటు అయ్యే ID, చిరునామా రుజువు ఉంటాయి.

1. మీ ఓటరు IDలో పేరును మార్చడానికి “నా పేరు” అని చెప్పే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

2. మీరు దరఖాస్తు చేస్తున్న ప్రదేశాన్ని (నగరం) ఎంటర్ చేయాలి.

3. మీ ఓటరు IDలో పేరు కరెక్షన్‌ రెక్వెస్ట్‌ చేస్తున్న తేదీని పేర్కొనండి

4. మీ సంప్రదింపుల సమాచారాన్ని అందించండి (మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి)

5. మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించండి. “ఓకె” ట్యాబ్‌పై క్లిక్ చేయండి

6. మొత్తం సమాచారం సరైనదైతే ECI సమాచారాన్ని ధృవీకరిస్తుంది.

Viral Video: అదృష్టం అంటే ఈ పిల్లిదే.. స్టైల్‌గా ఎలా కునుకుతీస్తుందో చూడండి.. వైరల్ వీడియో

KGF 2 : కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 25న అప్‌డేట్‌ వచ్చేస్తోంది..

S. Thaman : వాడికి పనిస్తే ఇలా చేశాడు..సర్కారు వారి పాట సాంగ్ లీక్ పై తమన్ ఆవేదన..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu