Spicejet: ప్రయాణికులకు స్పైస్‌జెట్ బంపరాఫర్.. రూ. 1818కే ఫ్లైట్ టికెట్స్. పూర్తి వివరాలు..
ప్రముఖ విమానాయన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణికుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 18వ వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను అందిస్తోంది. ప్రయాణికులకు కేవలం రూ. 1818కే విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని స్పైస్‌జెట్ కల్పిస్తోంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకునే ప్రయాణికులు..

ప్రముఖ విమానాయన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణికుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 18వ వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను అందిస్తోంది. ప్రయాణికులకు కేవలం రూ. 1818కే విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని స్పైస్‌జెట్ కల్పిస్తోంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకునే ప్రయాణికులు మే 23వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో టికెట్ బుస్ చేసుకున్న వారు 2023 జులై 1వ తేదీ నుంచి 2024 మార్చ్ 30వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కొన్ని ఎంపిక చేసిన రూట్లకే పరిమితం చేశారు. బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇక ఈ ఆఫర్ మాత్రమే కాకుండా స్పైస్‌జెట్ ప్రయాణికుల కోసం మరికొన్ని డిస్కౌంట్ కూపన్లు అందిస్తోంది. 2023లో 18 ఏళ్లు వయసు కలిగిన లేదా 18వ పుట్టినరోజును జరుపుకుంటోన్న ప్రయాణికులకు రూ. 3,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను అందిస్తోంది. ఈ కూపన్ పొందడానికి జూన్ 10 తేదీలోపు స్పైస్‌జెట్‌కు తమ వివరాలను ఈ-మెయిల్ చేయాలి. ఇలా చేసిన వారికి జులై 10 వరకు కూపన్ పంపిస్తారు.




Your destination: Savings! Celebrate our 18th anniversary with sky-high discounts. Book your tickets now at https://t.co/PykmFjGBqZ#flyspicejet #spicejet #18thAnniversary #SpiceJetAnniversary #sale #Travel #travelgram #Aviation #travelwithus #addspicetoyourtravel pic.twitter.com/2rjYDRXQ54
— SpiceJet (@flyspicejet) May 23, 2023
ఈ కూపన్‌తో 31 ఆగస్టులోపు టికెట్ బుక్ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించొచ్చు. అయితే ఈ ఆఫర్ పొందాలంటే బుకింగ్స్ కనీసం రూ. 7500 బుకింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్పైస్‌మ్యాక్స్ ద్వారా టికెట్‌లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్‌తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..