Electric scooter: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ దూసుకెళుతుంది
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలన్నీ వరుసగా విద్యుత్ ఆధారిత స్కూటర్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆటో మొబైల్ దిగ్గజం మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొస్తోంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ మంగళవారం మార్కెట్లోకి...
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలన్నీ వరుసగా విద్యుత్ ఆధారిత స్కూటర్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆటో మొబైల్ దిగ్గజం మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొస్తోంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ మంగళవారం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ స్కూటర్‌లో ఫాస్ట్ టెక్నాలజీ, డ్యుయల్ బ్యాటరీ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. IP67 రేటింగ్‌తో కూడిన 5kWh లిథియం ఐయాన్ డ్యుయల్ బ్యాటరీ ఈ స్కూటర్ సొంతం. ఇక ఈ స్కూటర్ ఫ్రంట్ భాగంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 7 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే.. నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీ రేంజ్ వివరాలు, కాల్ అలర్ట్ వంటి వివరాలను స్క్రీన్‌పై చూసుకునే అవకాశం ఉంది. ఇక ఈ స్కూటర్ ఒక్క నిమిషంలోనే 1.5 కి.మీ ప్రయాణించేందుకు కావాల్సిన ఛార్జింగ్ పూర్తవుతుంది.
5.54 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ పూర్తికావడం ఈ స్కూటర్ మరో ప్రత్యేకత. బ్యాటరీని ఒక్కసారిగా పూర్తిగా ఛార్జ్ చేస్తే 212 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. 2.77 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇక ఈ స్కూటర్ ధర విషయానికొస్తే రూ. 1.45 లక్షలుగా ఉంది. 750 వాట్ పోర్టబుల్ ఛార్జర్‌కు అదనంగా రూ.13,000 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..