AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత పన్ను విధానంలో కీలక అప్డేట్‌..! కొత్త ఆదాయపు పన్ను కంటే..

పాత ఆదాయపు పన్ను విధానం 2026 ముసాయిదా నియమాలు HRA, పిల్లల విద్య, హాస్టల్ అలవెన్సులు, భోజన వోచర్ల పరిమితులను గణనీయంగా పెంచాయి. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు HRA మినహాయింపు విస్తరించింది. ఈ మార్పులు పాత విధానాన్ని మినహాయింపులు క్లెయిమ్ చేసేవారికి మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

పాత పన్ను విధానంలో కీలక అప్డేట్‌..! కొత్త ఆదాయపు పన్ను కంటే..
ఒకవేళ పొరపాటు జరిగితే, అప్‌డేట్‌ చేసిన ITRను దాఖలు చేయడానికి ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. పునఃమూల్యాంకన నోటీసు అందుకున్న తర్వాత కూడా మీరు సరైన మూలాన్ని చూపుతూ అప్‌డేట్‌ చేసి రిటర్న్‌ను దాఖలు చేస్తే, మీకు సెక్షన్ 115BBE కింద మినహాయింపు లభించకపోవచ్చు. కానీ మీరు భారీ జరిమానా, జైలు శిక్షను తప్పించుకోవచ్చు.
SN Pasha
|

Updated on: Feb 22, 2026 | 1:27 AM

Share

పాత ఆదాయపు పన్ను విధానం 2026 ముసాయిదా నియమాలతో సిద్ధమైంది. అద్దె భత్యం (HRA), పిల్లల విద్య, హాస్టల్ అలవెన్సులు, భోజన వోచర్లు, యజమాని పెర్క్‌లకు సంబంధించిన పరిమితులను పెంచుతూ ప్రభుత్వం చేసిన ఈ మార్పులు పన్ను చెల్లింపుదారుల్లో కొత్త చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా మినహాయింపులపై ఆధారపడే ఉద్యోగులకు పాత విధానం మళ్లీ రిలేట్‌ అవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

నిపుణుల అంచనాల ప్రకారం.. సరళత కారణంగా కొత్త పన్ను విధానం ఇప్పటికీ చాలా మంది జీతదారులకు అనుకూలంగానే ఉంది. అయితే తాజా సవరణలు అద్దె చెల్లించే వారు, పిల్లల చదువు ఖర్చులు ఎక్కువగా ఉన్న కుటుంబాలు, యజమాని అందించే ప్రయోజనాలు పొందేవారికి పాత విధానాన్ని కొంత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ సురేష్ సురానా దీన్ని పరివర్తన చర్యగా అభివర్ణిస్తూ, రెండు విధానాలు కలిసి ఉన్న పరిస్థితిలో సమాన ఉపశమనం ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు.

ఈ ముసాయిదాలో అత్యంత ముఖ్యమైన మార్పు మెట్రో స్థాయి HRA మినహాయింపుకు అర్హ నగరాల విస్తరణ. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై మాత్రమే ఉండగా, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ నగరాలు కూడా చేర్చబడ్డాయి. దీంతో ఈ నగరాల్లో అద్దెకు ఉండే ఉద్యోగులకు HRA మినహాయింపు గణనీయంగా పెరగనుంది.

అలాగే పిల్లల విద్య, హాస్టల్ అలవెన్సుల పరిమితులు పెరగడం, భోజన వోచర్ విలువను ఒక్కో భోజనానికి రూ.50 నుంచి రూ.200కు పెంచడం, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) నియమాలను సడలించడం వంటి మార్పులు పన్ను భారం తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు. యజమాని అందించే వసతి, కారు వినియోగం, రాయితీ రుణాల విలువ నిర్ణయంలో కూడా ఆధునిక పద్ధతులు తీసుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం దీర్ఘకాలంలో సరళమైన కొత్త విధానానికే ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఎక్కువ మినహాయింపులు క్లెయిమ్ చేసే వారికి పాత విధానం లాభదాయకంగా ఉండొచ్చు. మిగిలిన చాలామందికి కొత్త విధానం ఇంకా సులభమైన ఎంపికగానే నిలుస్తుందని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా