AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Bikes: రోడ్లపై దూసుకుపోనున్న ఓలా బైక్స్.. ఆ బైక్ డెలివరీలు షురూ

ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడుకుంటే మనకు ముందుగా ఓలా పేరు గుర్తుకువస్తుంది. ఆ కంపెనీ విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీ డిమాండ్ ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మోడళ్లను ఓలా విడుదల చేస్తోంది. మన దేశ మార్కెట్ లో దాదాపు 30 శాతానికి పైగా వాటా సంపాదించింది. ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత పెంచుకునేందుకు ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ను ప్రవేశపెట్టింది. ఓలా రోడ్ స్టర్ ఎక్స్ అనే పేరుతో తీసుకువచ్చిన ఈ బైక్ డెలివరీలను మన దేశంలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త బైక్ ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

Ola Bikes: రోడ్లపై దూసుకుపోనున్న ఓలా బైక్స్.. ఆ  బైక్ డెలివరీలు షురూ
Roadster X
Nikhil
|

Updated on: May 24, 2025 | 4:15 PM

Share

ఓలా రోడ్ స్టర్ ఎక్స్ బైక్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని 2.5, 3.5, 4.5 కేడబ్ల్యూహెచ్ అనే మూడు రకాల బ్యాటరీ ప్యాక్ లతో తీసుకువచ్చారు. ప్రతి వేరియంట్ లో 4.3 అంగుళాల ఎల్ సీడీ ఇన్ స్ట్రుమెంట్ ప్యానల్ ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివీటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, రివర్స్ మోడ్, క్రూయీజ్ కంట్రోల్ తదితర ప్రయోజనాలు అందిస్తుంది. బ్రేక్ బై వైర్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అదనపు ప్రత్యేకతలు. రోడ్ స్టర్ ఎక్స్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఏర్పాటు చేశారు. ముందు 18 అంగుళాలు, వెనుక 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఇవి రెండూ ట్యూబ్ లెస్ టైర్లు కావడం విశేషం. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎంగా ఉంది. అలాగే అన్ని వేరియంట్లలో 7కే మిడ్ మౌంటెడ్ మోటారును వినియోగించారు.

బెస్ వేరియంట్

రోడ్ స్టర్ ఎక్స్ బైకు సిరీస్ లోని బేస్ వేరియంట్ లో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీని ధర కేవలం రూ.74,999 (ఎక్స్ షోరూమ్) మాత్రమే. పూర్తిస్థాయి సింగిల్ చార్జిపై సుమారు 140 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. గంటకు గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. కేవలం 3.4 సెకన్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

మిడ్ స్పెక్ వేరియంట్

మిడ్ స్పెక్ వేరియంట్ లో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. సింగిల్ చార్జిపై సుమారు 196 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బేస్ మోడల్ తో పోల్చితే చాలా మెరుగైన పరిధిని అందిస్తుంది. కేవలం 3.1 సెకన్లలో సుమారు 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 108 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఈ మిడ్ స్పెక్ వేరియంట్ రూ.84,999కి అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

టాప్ స్పెక్ వేరియంట్

ఓలా రోడ్ స్టర్ ఎక్స్ టాప్ స్పెక్ వేరియంట్ లో 4.5 బ్యాటరీ ఏర్పాటు చేశారు. మూడు మోడళ్లలో ఇదే పెద్ద బ్యాటరీ. ఈ బైక్ సుమారు 252 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 3.1 సెకన్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 118 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.94,999 ధర (ఎక్స్ షోరూమ్)లో అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?