Ola EV Bike: ఓలా ఈవీ బైక్‌పై మతిపోయే ఆఫర్.. అదేంటో తెలుసుకోవాల్సిందే..!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే క్రమేపి బైక్ లవర్స్ కూడా ఈవీ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఓలా రోడ్ స్టర్ పేరుతో ఈవీ బైక్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఆ బైక్‌పై నమ్మశక్యం కానీ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రముఖ ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రూ.10,000 విలువైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది . ఈ ఆఫర్‌లో కంపెనీ బ్యాటరీ ప్యాక్ కోసం ఉచిత ఎక్స్‌టెండెడ్ వారెంటీ, ఫ్రీ మూవ్ ఓఎస్ ప్లస్‌తో పాటు అవసరమైన ఫ్రీ మెయిన్‌టెనెన్స్ సేవలను అందిస్తోంది. ఈ ఆఫర్ మొదటి 5,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని షరతు పెట్టింది. ఓలా రోడ్లస్టర్ ఎక్స్ కోసం ‘ఎసెన్షియల్ కేర్’ ప్యాకేజీలో మోటార్ సైకిల్ భద్రత, గరిష్ట పనితీరును నిర్ధారించడానికి కీలకమైన భాగాలను కవర్ చేసే 18 పాయింట్ల తనిఖీ ఉంటుంది. ఈ సర్వీసింగ్ ద్వారా బ్రేక్లు, టైర్లు, యాక్సిల్ మరిన్ని వంటి కీలక భాగాలను చెక్ చేస్తారు. అదనంగా రియల్ ప్రొడెక్ట్స్ వినియోగానికి హామీ ఇస్తుంది. అలాగే సర్టిఫైడ్ నిపుణుల నైపుణ్యం ద్వారా మద్దతు ఇస్తుంది.
ఓలా రోడ్లస్టర్ ఎక్స్ అన్ని వేరియంట్లలో 4.3 అంగుళాల ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ డిస్ ప్లేతో ఆకట్టుకుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి కీలకమైన ఫీచర్లను ఈ స్క్రీన్ ద్వారా పొందవచ్చు. అందువవల్ల రోజువారీ రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. భద్రత, సాంకేతికత పరంగా, ఓలా ప్రతి మోడల్ బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. రోడ్ల స్టర్ ఎక్స్ సమతుల్య ప్రయాణం కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లతో ఆకట్టుకుంటుంది.
ఓలా రోడ్లస్టర్ ఎక్స్‌ను మూడు బ్యాటరీ శక్తితో నడిచే వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఒకే 7 కేడబ్ల్యూ మిడ్-మౌంటెడ్ మోటారుతో మద్దతు ఇస్తుంది. బేస్ వేరియంట్ (2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ) రూ.74,999 ధరతో వస్తుంది. అలాగే ఈ బైక్‌ను ఓ సారి ఫుల్‌గా చార్జ్ చేస్తే 140 కి.మీ మైలేజ్ ఇస్తుంది. మిడ్-వేరియంట్ 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 84,999గా ఉంటే 196 కి.మీ.ల మైలేజ్ ఇస్తుంది. టాప్ వేరియంట్ 4.5 కడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రీమియం మోడల్ ధర రూ.94,999గా ఉంది. అలాగే ఈ బైక్ 252 కి.మీ. మైలేజ్ అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి