Viral Video: నీటిలోని మొసలిపై స్వామీజీ సవారీ… వైరల్ అవుతోన్న షాకింగ్ వీడియో
నీటిలో ఉన్న మొసలితో పెట్టుకుంటే ఎంత పెద్ద జంతువైనా, మనిషైనా మట్టి కరవాల్సిందే. చేతికి చిక్కితే చాలు నిమిషాల్లో నమిలి మింగేస్తుంది. అడవికి రాజు సింహం సైతం నీళ్ల దగ్గరికి వెళ్లినప్పుడు తమ జాగ్రత్తలో తాము ఉంటాయి. మనుషులనే కాదు.. క్రూర జంతువులకు...

నీటిలో ఉన్న మొసలితో పెట్టుకుంటే ఎంత పెద్ద జంతువైనా, మనిషైనా మట్టి కరవాల్సిందే. చేతికి చిక్కితే చాలు నిమిషాల్లో నమిలి మింగేస్తుంది. అడవికి రాజు సింహం సైతం నీళ్ల దగ్గరికి వెళ్లినప్పుడు తమ జాగ్రత్తలో తాము ఉంటాయి. మనుషులనే కాదు.. క్రూర జంతువులకు సైతం వణుకు పుట్టించే మొసలిపై ఓ వ్యక్తి సవారీ చేయడం ఎప్పుడైనా చూశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. పూజారిలా దుస్తులు ధరించిన వ్యక్తి ఒక పెద్ద మొసలి మీద కూర్చుని నదిని దాటుతున్నట్లు వీడియోలో కనపడుతుంది.
ఈ వీడియో చాలా దిగ్భ్రాంతికరంగా ఉందని, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇదో అద్భుతంగా అభివర్ణిస్తున్నారు నెటిజన్స్.
అయితే, ఈ వీడియో ఎంత షాకింగ్‌గా ఉన్నా, దాని నిజం కూడా భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి, ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI సహాయంతో తయారు చేయబడింది. ఈ వీడియో యొక్క ప్రామాణికత గురించి కొంతమంది గ్రోక్ AIని ప్రశ్నించినప్పుడు, ఈ వీడియో కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (CGI) సహాయంతో మాత్రమే తయారు చేయబడిందని మరియు కేవలం సంచలనాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే అని గ్రోక్ బదులిచ్చింది.
వీడియో చూడండి:
देखिए सनातन धर्म की ताकत पुजारी महाराज को मंदिर तक अपनी पीठ पर ले जाता है यह मगरमच्छ।। pic.twitter.com/5PJfCKdAKx
— Disha Rajput (@DishaRajput24) June 11, 2025