AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA Offers: మాన్‌సూన్ ఆఫర్స్ ప్రకటించిన టాటా.. ఆ సర్వీసులపై ప్రత్యేక తగ్గింపులు

భారతదేశంలో టాటా కార్లు అంటే ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు టాటా కార్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కార్ల నిర్వహణ అనేది చాలా ఖర్చుతో పనిగా మారుతుంది. ముఖ్యంగా వర్షాకాలం ముందు కారును కండిషన్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి టాటా మోటర్స్ కార్ల నిర్వహణ విషయంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

TATA Offers: మాన్‌సూన్ ఆఫర్స్ ప్రకటించిన టాటా.. ఆ సర్వీసులపై ప్రత్యేక తగ్గింపులు
Tata Cars
Nikhil
|

Updated on: Jun 11, 2025 | 7:30 PM

Share

టాటా మోటార్స్ తమ కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా మాన్‌సూన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్యాంప్ 500 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే 1,090 అధీకృత వర్క్ షాప్‌ల ద్వారా మద్దతు ఉంటుంది. జూన్ 20, 2025 వరకు టాటా కస్టమర్లకు రుతుపవన తనిఖీ శిబిరం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైవింగ్ పరిస్థితులలో సరైన వాహన పనితీరు, భద్రతను నిర్ధారించడమే లక్ష్యంగా టాటా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాంపు ద్వారా కస్టమర్లు ఉచిత, సమగ్రమైన వెహికల్ హెల్త్ అంచనాను పొందే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన డయాగ్నస్టిక్స్ పాటు, అవసరమైన వ్యవస్థలను పరిష్కరించే ముప్పైకి పైగా ముఖ్యమైన తనిఖీ పాయింట్లు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా కార్ టాప్ వాష్, రియల్ ప్రార్ట్స్, ఇంజిన్ ఆయిల్, ఉపకరణాలు, పొడిగించిన వారంటీలు, కార్మిక ఖర్చుల పై ప్రత్యేక తగ్గింపులను కూడా అందిస్తుంది. అలాగే కస్టమర్లు కొత్త టాటా వాహనాల పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.

అలాగే ఇటీవల టాటా హారియర్ ఈవీ అధికారికంగా రూ.21.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ఇటీవల ప్రారంభించారు ఈ లాంచ్‌లో హారియర్ ఈవీ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి ప్రీమియర్ ఎలక్ట్రిక్ వాహనంగా స్థిరపడింది. ఈ కొత్త మోడల్ తయారీదారు అభివృద్ధి చేసిన తాజా ఈవీ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది.దీనిని యాక్టీ.ఈవీ ప్లస్ అని పిలుస్తుంది. టాటా మోటార్స్ ఆఫర్లకు ఆల్ వీల్ డ్రైవ్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది. టాటా హారియర్ ఈవీ మూడు ట్రిమ్ లెవెల్స్‌లో అందుబాటులో ఉంటుంది. అడ్వెంచర్, ఫియర్స్, ఎంపవర్డ్. అలాగే ఈ కారు నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. నైనిటాల్ నాక్టర్నల్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే మరియు ప్రిస్టిన్ వైట్, ప్రత్యేక బ్లాక్-అవుట్ స్టీల్ ఎడిషన్‌తో పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్ జూలై 2న ప్రారంభం కానున్నాయి. హారియర్ ఈవీ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, అలాగే బీవైడీ అట్టో 3 వంటి వాహనాలతో పోటీపడుతుంది.

టాటా హారియర్ ఈవీ కొత్త యాక్టీ.ఈవీ ప్లస్ ఆర్కిటెక్చర్‌తో రిలీజ్ చేశారు. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సామర్థ్యాలతో ప్రారంభించి అనేక ఫీచర్స్‌ను అందిస్తుంది. హారియర్ ఈవీ అనేది టాటా మోటార్స్ నుంచి ఏడబ్ల్యూడీ సామర్థ్యాలను అందించే మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది. గతంలో టాటా సఫారీ, హెక్సా, ఆరియా మాత్రమే టాటా మోటార్స్ నుంచి 4X4 లేదా ఏడబ్ల్యూడీ సామర్థ్యాలతో కూడిన మోడల్స్‌గా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో అయితే టాటా హారియర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు, రెండు మోటార్ కాన్ఫిగరేషన్లతో అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి