Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే ఐపీఎల్ స్టార్.. గిఫ్ట్‌గా వచ్చిన లగ్జరీ కారు ఏం చేశాడో తెలుసా?
కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు తెలిశాడు. అవార్డులు, విలాసవంతమైన బహుమతులను పొందుతున్నాడు. 2025 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ చేసిన అద్భుతమైన తొలి సీజన్ తర్వాత ఈ టీనేజర్ విధ్వంసకరబ్యాటింగ్‌కు మాత్రమే కాకుండా కొన్ని సంస్థలు ద్వారా వచ్చే బహుమతులతో వార్తల్లో నిలుస్తున్నాడు.

ఇటీవల వైభవ్‌ను ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా ప్రకటించారు. ఈ అవార్డును టాటా మోటార్స్ అందజేసింది. దీంతో అతడికి సరికొత్త కర్వ్ ఈవీను అందించారు. వైభవ్ వద్ద ఇప్పటికే మెర్సిడెస్-బెంజ్ కూడా ఉంది. ఈ సీజన్ ప్రారంభంలో అతని అద్భుతమైన ఆటతీరు తర్వాత రాజస్థాన్ రాయల్స్ యజమాని రంజిత్ బర్తాకూర్ బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కార్లు అయితే బహుమతులుగా వస్తున్నాయి కానీ వాటిని నడపడానికి వైభవ్‌కు అవకాశం లేదు. దేశంలో చట్టబద్ధమైన డ్రైవింగ్ వయస్సు 18 సంవత్సరాలుగా ఉంది. ముఖ్యంగా అతను లెర్నర్ లైసెన్స్‌కు అర్హత సాధించడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది. అలాగే అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఇదే విషయాన్ని జోక్‌గా అన్నాడు. అయితే టాటా కర్వ్ ఈవీను అతడు తన తల్లికి ఇస్తున్న మొదటి బహుమతి పేర్కొన్నాడు.
ఈ సీజన్ ప్రారంభంలో రాజస్థాన్ రాయల్స్ షేర్ చేసిన వీడియోలో తన కెరీర్‌లో తన తల్లి పోషించే అపారమైన పాత్రను వైభవ్ చెప్పాడు ఆమె రాత్రి 11 గంటలకు నిద్రపోతుంది. నా ప్రాక్టీస్ సెషన్‌లకు సిద్ధం కావడానికి తెల్లవారుజామున 2 గంటలకు మేల్కొంటుందని తెలిపాడు. ఆమె ప్రతి రాత్రి కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయి తనకు విజయంలో కీలక పాత్ర పోషించిందని వివరించాడు. అయితే అతడికి వస్తున్న బహుమతుల నేపథ్యంలో ఓ అనుమానం అందరికీ వస్తుంది. ఒక మైనర్ చట్టబద్ధంగా వారి పేరు మీద కారును నమోదు చేసుకోవచ్చా? అనే అనుమానం వస్తుంది. దీనిపై ఓ ఆర్టీఏ అధికారి స్పందించారు. కారు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా వ్యక్తి మైనరా లేదా పెద్దవాడా అనే దానిపై ఆధారపడి ఉండదు. పాన్ కార్డ్, ఆధార్, చిరునామా రుజువు వంటి అన్ని అవసరమైన పత్రాలు ఉంటే మైనర్ పేరుతో కూడా వాహనాన్ని నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
వాహనానికి యాజమాని అవ్వడం సులభమే అయినా దానిని నడపడం సాధ్యం కాదని ఆర్టీఏ అధికారులు చెబతున్నారు. వైభవ్ విషయంలో కర్వ్ ఈవీ కారు అధికారికంగా అతడికి బహుమతిగా ఇచ్చినందువల్ల అతని పేరు మీద రిజిస్టర్ చేస్తారని భావిస్తున్నారు. మెర్సిడెస్ విషయానికొస్తే దీనిని చట్టబద్ధంగా వైభవ్ పేరుతో రిజిస్టర్ చేయవచ్చని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతానికి వేరే ఎవరైనా బాధ్యతతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి