Ola S1 Air: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. ఆ స్కూటర్ల కన్నా ఇదే బెస్ట్.. డెలివరీలు ప్రారంభిస్తున్న ఓలా ఎలక్ట్రిక్..
ఓలా తన పోర్ట్ ఫోలియోను మరింత పెంచుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇంతకు ముందే ప్రకటించిన ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్లకు సంబంధించిన డెలివరీలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈస్కూటర్ స్టైలిష్ డిజైన్ తో పాటు మంచి పనితీరును కలిగి ఉంది. అలాగే ధర కూడా అందుబాటులోనే ఉంటుంది.

మన దేశంలో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు తిరుగులేదు. గత రెండు మూడేళ్లుగా అత్యధికంగా అమ్మడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఓలా ఎలక్ట్రిక్ వే ఉంటున్నాయి. వరుసగా రెండేళ్లు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఓలా కంపెనీ. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో ఓలా తనదైన ముద్ర వేసింది. అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త రైడింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇదే క్రమంలో ఓలా తన పోర్ట్ ఫోలియోను మరింత పెంచుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇంతకు ముందే ప్రకటించిన ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్లకు సంబంధించిన డెలివరీలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈస్కూటర్ స్టైలిష్ డిజైన్ తో పాటు మంచి పనితీరును కలిగి ఉంది. అలాగే ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. ఓలా ఎస్1 ఎయిర్ రూ. 1,09,999కే లభ్యమవుతోంది. ఇది మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు వినియోగదారుల చేతుల్లోకి రానుంది. ఇది ప్రధానంగా ఏథర్ 450ఎక్స్ స్కూటర్ కి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్ మధ్య తేడాలు ఓసారి చూద్దాం..
ఓలా ఎస్1 ఎయిర్ స్పెసిఫికేషన్లు..
ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ లో 4.5 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన మోటార్ ఉంటుంది. అయితే ఇతర స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కాగా దీంతో ఇదే తరహాలో అందుబాటులో ఉన్న మరో మోడల్ ఓలా ఎస్1 ప్రో లాగానే దీనిలోనూ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఓలా ఎస్1 ఎయిర్ రేంజ్, స్పీడ్..
ఓలా ఎస్1 ఎయిర్ లోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 125 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది రోజూ వారి అవసరాలకు కచ్చితంగా సరిపోతోంది. అయితే దీని మరో మోడల్ ఓలా ఎస్1 ప్రో అయితే ఏకంగా 181 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అదే సమయంలో దీని ప్రధాన పోటీదారు ఏథర్ 450ఎక్స్ సింగిల్ చార్జ్ పై 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అయితే ధర విషయంలో ఓలా ఎస్1 ఎయిర్ కాస్త తక్కువగా ఉండటంతో రేంజ్ అంతగా పట్టించుకునే అవసరం ఉండదు. ఓలా ఎస్1 ఎయిర్ గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది.



ఓలా ఎస్1 ఎయిర్ ఫీచర్లు..
ఈ స్కూటర్లో 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇది సీటు కింద ఉంటుంది. అలాగే కాళ్లు పెట్టుకునేందుకు ఫ్లాట్ ఫూట్ బెడ్ ఉంటుంది. ఇది రైడర్ సౌకర్యవంతంగా ఉంటుంది. ట్విన్ ఫోర్క్స్, డిజిటిల్ కీ వంటి ఫీచర్లు అదనంగా ఉంటాయి.
ఓలా ఎస్1 ధర, లభ్యత..
ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,09,999గా ఉంది. ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఇది అనువైన బడ్జెట్ అనే చెప్పాలి. అదే క్రమంలో దీనికి ప్రధాన పోటీదారుగా పేర్కొంటున్న ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్టార్స్ ధర దాదాపు రూ. 1,40,000 నుంచి ప్రారంభమై టాప్ మోడల్స్ అయితే రూ. 1,65,000 వరకూ ఉంది. ఓలా ఎస్1 ప్రో స్కూటర్ అయితే రూ. 1,39,99కాగా, స్టాండర్డ్ మోడల్ ఓలా ఎస్1 రూ. 1,29,999గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




