AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Investment Options: కొత్తగా పెళ్లైన వారికి అలర్ట్.. ఆర్థికంగా బాగా స్థిరపడాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి..

కొత్త పెళ్లైన వారు ముందు నుంచి పొదుపు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి. మంచి పథకాలలో భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాలి. అందుకే కొత్తగా పెళ్లైన వారు ఎంపిక చేసుకోదగిన మంచి పెట్టుబడి ఆప్షన్లను ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం రండి..

Best Investment Options: కొత్తగా పెళ్లైన వారికి అలర్ట్.. ఆర్థికంగా బాగా స్థిరపడాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి..
Newly Married Couple
Madhu
|

Updated on: Jul 11, 2023 | 5:00 PM

Share

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అయితే అసలు జీవితం పెళ్లి తర్వాతే ప్రారంభమవుతుందని పెద్దలు చెబుతుంటారు. అప్పటి వరకూ తల్లిదండ్రులపై ఆధారపడిన ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా బాధ్యతలు తీసుకోవడం అన్ని క్రమ పద్ధతిలో నిర్వహించడం కాస్త కష్టమే. అయితే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటేనే కొత్తగా పెళ్లైన వారి జీవితం సుఖవంతంగా ఉంటుంది. సాధారణంగా కొత్తగా పెళ్లైన వారి ఇంట్లో ఖర్చు అధికంగానే ఉంటుంది. అలాగే వారు సెపరేట్ గా కుటుంబాన్ని నిర్మించుకోవాలనుకొనే వారికైతే ఆ భారం అధికంగా ఉంటుంది. కొత్త ఇల్లు, ఇంట్లో సామగ్రి, గృహోపకరణాలు వంటి కొత్త కుంటుబాన్ని ప్రారంభిచాలనుకొనే వారు కనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో భవిష్యత్తు అవసరాలను బట్టి, అంటే పిల్లలు పుట్టి వారి చదువులు, పెళ్లిళ్ల వరకూ ఖర్చులే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త పెళ్లైన వారు ముందు నుంచి పొదుపు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి. మంచి పథకాలలో భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాలి. అందుకే కొత్తగా పెళ్లైన వారు ఎంపిక చేసుకోదగిన మంచి పెట్టుబడి ఆప్షన్లను ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిల్లో మంచి ఎంపికలను వివరిస్తున్నారు. ఆ స్కీమ్ లుఏంటో చూద్దాం రండి..

బీమా పాలసీలు.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనుకోని సంఘటనలు, ప్రమాదాలు, ఇలా ఊహించని విధంగా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే కొత్త పెళ్లైన జంటలు బీమా పాలసీలు తీసుకోవడం ఉత్తమం. మీ కోసం, మీ జీవిత భాగస్వామి కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని, అన్ని ఆరోగ్య ప్రమాదాలను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. మీ కుటుంబం కోసం సమగ్ర జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం చాలా ఉత్తమమైన మార్గం. ఇది మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.

ఇంటిని కొనుగోలు చేయాలి.. మొదటి ఇంటిని కొనుగోలు చేయడం సాధారణంగా కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభించడంలో మొదటి అడుగు. యువ జంటలు తమకు అవసరమైనంత పెద్దదిగా ఉండే ఇంటిని కొనుగోలు చేయాలి. తగినంత సౌకర్యాలు ఉండాలి. అలాగే పనికి వెళ్లడానికి, తిరిగి రావడానికి సులభంగా రోడ్ కనెక్టవిటీ ఉండే ప్రాంతాలలో ఇల్లు ఎంపిక చేసుకోవాలి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా కరెన్సీ విలువ ఎక్కువగా తగ్గుతున్న సమయాల్లో, గృహాన్ని కొనుగోలు చేయడం వల్ల ద్రవ్యోల్బణంతో సంబంధం ఉన్న నష్టాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, అనేక బ్యాంకులు దంపతుల ఉమ్మడి జీతం ఆధారంగా గృహ రుణాల కోసం ఉమ్మడి రుణ ఖాతాలను కూడా అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్).. నూతన వధూవరులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉత్తమ దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఈ ఖాతా అధిక లాభాలను ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వ మద్దతుతో ఉంటుంది కాబట్టి చాలా సురక్షితమైన పథకం.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్).. ఇది ఉత్తమ పదవీ విరమణ పొదుపు పథకం. దీనిలో చందాదారులు వారి పని జీవితమంతా క్రమబద్ధమైన పొదుపు ద్వారా వారి భవిష్యత్తు కోసం ఉత్తమ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఎన్పీఎస్ ట్రస్ట్ అధికారిక సైట్ ప్రకారం, పదవీ విరమణ కోసం పొదుపు చేసే అలవాటును నివాసితులలో కలిగించడం ఎన్పీఎస్ లక్ష్యం.

బంగారం.. బంగారంలో పెట్టుబడి అనేది యువ వివాహిత జంటలకు ఉత్తమ పెట్టుబడులలో ఒకటి. ఎందుకంటే ఇది వారి సామాజిక పెట్టుబడి అవసరాలను తీర్చగలదు. మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఇది సాధారణంగా ఎక్కువ కాలం ఉండదు. ఎల్లప్పుడూ గణనీయమైన పెరుగుదలను కలిగిస్తుంది. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత, మీరు మీ వ్యూహాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పెట్టుబడిని ప్రారంభించాలి. అంతేకాకుండా, మీరు భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టకూడదనుకుంటే, మీరు గోల్డ్ బాండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..