5

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. రేపే విడుదల.. ఫీచర్లు.. ధర ఎలా ఉన్నాయంటే..!

ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తోన్న ఓలా బైక్ విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు ప్రజల చెంతకు వచ్చేందుకు ముస్తాబైంది.

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. రేపే విడుదల.. ఫీచర్లు.. ధర ఎలా ఉన్నాయంటే..!
Ola Electric Scooter
Follow us

|

Updated on: Aug 14, 2021 | 5:37 PM

Ola Electric Scooter: ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తోన్న ఓలా బైక్ విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు ప్రజల చెంతకు వచ్చేందుకు ముస్తాబైంది. ఇప్పటికే ఈ బైక్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లోనూ సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ ప్రకటించి బైక్‌పై ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం కొన్ని ఫీచర్లు, ధర ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. విడుదలకు కొద్ది గంటల ముందునుంచే ఈ సందడి మొదలైంది. విడుదలయ్యాక కానీ, అసలు ధర, ఫీచర్లు తెలియనున్నాయి.

కేవలం 24 గంటల్లో దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లు వచ్చాయంట. ఈ క్రేజ్‌తో పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ బైక్‌లను విపణిలోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే దిగ్గజ మోటర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్‌ ఈ రంగంలోకి ప్రవేశించింది. అలాగే సింపుల్ వన్ కంపెనీ అప్పుడే ఫ్రీ బుకింగ్‌ ప్రక్రియను షూరూ కూడా చేసింది. ఎన్నో సంచనాలకు మారుపేరుగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ బైక్… రేపు విడుదల కానుండడంతో అందిరి చూపు వాటిపైనే నెలకొంది. అసలు వాటి లీకైన ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం..

ఒక్క సారి ఛార్జింగ్‌ పెడితే.. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే దాదాపు 150 కిలో మీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణిస్తాయని తెలుస్తోంది. అయితే వీటిపై కంపెనీ నుంచి అధికారిక సమచాచం రావాల్సి ఉంది. ఈమేరకు ‘ఓలా స్కూటర్లు ముందుకే కాదు వెనుకకూ ప్రయాణించగలవు. స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌తో ఓలా స్కూటర్‌ను యాక్సెస్ చేయోచ్చు’ అంటూ ఓలా సీఈఓ భవీష్‌ అగ్వరాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Ola Electric Scooter1

కొలతలు, బరువు.. ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ పొడవు సుమారు 1,860 మిల్లీమీటర్ల పొడవు ఉంటుందని తెలుస్తోంది. అలాగే వెడల్పు విషయానికి వస్తే 700 మిల్లీ మీటర్లు ఉన్నట్లు సమాచారం. ఇక 1,155 మిల్లీ మీటర్లు ఎత్తు ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీల్‌బేస్ 1,345 మిల్లీ మీటర్లు ఉంటుందని, అలాగే బరువు 74 కిలోలు ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ సామర్ధ్యం.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ 3.4kWh బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది.

Ola Electric Scooter2

బైక్‌ స్పీడ్‌.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ 4.5 సెకన్లలో గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని సమాచారం. అత్యధికంగా గంటకు వంద కిలోమీటర్ల వేగం ఉండొచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

సబ్సీడీలో ఓలా బైక్‌.. 2019లో ఫేమ్‌-2 ఫథకం కింద కేంద్రం ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. మినిమం రేంజ్‌ 80 కిలోమీటర్లు, టాప్‌ స్పీడ్‌ 40కిలోమీటర్ల వేగం ఉన్న బైక్‌లకు మాత్రమే ఈ సబ్సీడీ అందనుంది. సబ్సీడీ కింద కిలో వాట్ అవర్ (kilowatt hour) కి రూ.10వేల సబ్సీడీ ఇస్తున్నట్లు ఇది వరకు ప్రకటించింది. అయితే దీనిని సవరించింది. ప్రస్తుతం 50శాతం అంటే కిలో మీటర్‌ కేడబ్ల్యూహెచ్‌కి రూ.15వేలు ఇస్తున్నట‍్లు పేర్కొంది. అయితే, కేంద్ర అందించే ఈ సబ్సీడీ ఓలా ఎలక్ట్రిక్ బైక్‌కు వర్తిస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. విడుదల రోజే ఈ వివరాలను కంపెనీ ప్రకటించనుంది.

ధర.. ఎక్స్‌షోరూం ధర లక్షా 20 వేల నుంచి లక్షా 30 వేల మధ్య ఉంటుందుని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ధర కూడా రేపే ప్రకటించనున్నారు.

Also Read: Bank FD: ఈ బ్యాంకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ.. ఆగస్టు 16 వరకు అవకాశం..!

RBI News: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. బ్యాంకు లైసెన్స్‌లు రద్దు.. ఆ మూడు బ్యాంకులకు భారీ జరిమానా